బెల్లం కలిపిన పాలను తీసుకుంటే మన శరీరంలో కలిగే మార్పులు ఏంటో తెలుసా?

Published : Apr 13, 2022, 04:41 PM IST

పాలు (Milk), బెల్లం (Jaggery) రెండు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దివ్యమైన ఔషధ పదార్థాలు. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.  

PREV
18
బెల్లం కలిపిన పాలను తీసుకుంటే మన శరీరంలో కలిగే మార్పులు ఏంటో తెలుసా?

అందుకే పంచదారకు బదులుగా బెల్లం కలిపిన వేడి పాలను ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యానికి అదనంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

28

బెల్లం కలిపిన పాలలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు (Nutrients) మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కలుగజేసే ప్రయోజనాలు బోలెడు. కనుక పంచదారకు బదులుగా బెల్లం కలిపిన వేడి పాలను ప్రతిరోజూ తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) మీ సొంతం.
 

38

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ప్రతిరోజూ బెల్లం కలిపిన వేడి పాలను తీసుకుంటే జీర్ణ సమస్యలు (Digestive problems) దూరమవుతాయి. అలాగే కడుపులో ఏర్పడే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి ఇబ్బందులు తగ్గుతాయి. అంతేకాకుండా  ప్రేగులలో  పేరుకుపోయిన మలం తేలికపడి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. దీంతో మలబద్దకం (Constipation) సమస్యలు కూడా తగ్గిపోతాయి.
 

48

బరువు తగ్గుతారు: బరువు తగ్గాలనుకొనే వారు బెల్లం కలిపిన పాలను తీసుకోవడం మంచిది. బెల్లం, పాలలో ఉండే ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును (Fat) తగ్గిస్తాయి. కనుక ప్రతి రోజూ బెల్లం కలిపిన పాలను తీసుకుంటే అధిక బరువు (Overweight), ఊబకాయం వంటి సమస్యలు తగ్గి బరువు అదుపులో ఉంటుంది. కనుక బెల్లం కలిపిన పాలను తీసుకోవడం ఉత్తమం.
 

58

రక్తహీనత సమస్యలు దూరమవుతాయి: ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యలతో (Anemia problems) బాధపడుతున్నారు. రక్తహీనత సమస్య కారణంగా శరీరంలోని రక్తం కొరత ఏర్పడి పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. కనక క్రమం తప్పకుండా బెల్లం కలిపిన పాలు తీసుకుంటే రక్తహీనత సమస్యలు తగ్గి రక్తంలో హిమోగ్లోబిన్ (Hemoglobin) శాతం పెరుగుతుంది.
 

68

రోగనిరోధక శక్తి పెరుగుతుంది: బెల్లం కలిపిన పాలలో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యలను (Illness issues) కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియాల బారినుండి శరీరాన్ని కాపాడుతాయి. కనుక ఈ పాలను ప్రతి రోజూ తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభించడంతో పాటు రోగనిరోధక శక్తి (Immunity) కూడా పెరుగుతుంది.
 

78

జుట్టు సౌందర్య మెరుగుపడుతుంది: బెల్లం కలిపిన పాలను ప్రతి రోజూ తీసుకుంటే జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది. బెల్లం పాలలో ఉండే పోషకాలు జుట్టుకు అంది జుట్టు కాంతివంతంగా మారడంతోపాటు జుట్టు రాలే సమస్య (Hair fall problem), జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే చుండ్రు (Dandruff) సమస్యలు కూడా దూరమవుతాయి. దీంతో జుట్టు సౌందర్యం పెరుగుతుంది.  
 

88

అంతేకాకుండా బెల్లం కలిపిన పాలను తీసుకుంటే కీళ్ల నొప్పులు (Arthritis), నిద్రలేమి (Insomnia), రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కనుక ప్రతిరోజూ బెల్లం కలిపిన పాలను తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

click me!

Recommended Stories