డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

Navya G   | Asianet News
Published : Mar 05, 2022, 02:05 PM IST

శరీరానికి శక్తిని అందించడం కోసం పండ్లు, పాలు తీసుకోవడం మామూలే. వాటితో పాటు శరీరానికి పోషకాలు, శక్తిని అందించే డ్రింక్స్ ను కూడా తీసుకోవడం కూడ అంతే ముఖ్యం.  

PREV
17
డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

కనుక డ్రైఫ్రూట్స్ తో చేసుకునే మిల్క్ షేక్ ను రోజులో ఒక పూట తీసుకున్నా ఆరోగ్యానికి (Health) ఎంతో మంచిది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ (Dried Fruit Milkshake) తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

27

కావలసిన పదార్థాలు: ఒక లీటరు పాలు (Milk), రెండు కుంకుమ పువ్వు రేకులు (Saffron flower petals), ముప్పావు కప్పు పంచదార (Sugar),  రెండు స్పూన్ ల అన్నీ కలిపిన డ్రై ఫ్రూట్స్ (All Mixed Dry Fruits) పలుకులు.
 

37

మసాలా కోసం: పావు కప్పు బాదం (Almonds), పావు కప్పు జీడిపప్పు (Cashew), పావు కప్పు పిస్తా (Pista) పలుకులు, రెండు టేబుల్ స్పూన్ ల సొంపు (Anise), ఒక స్పూన్ యాలకుల పొడి (Cardamom powder), కొద్దిగా దాల్చిన చెక్క పొడి (Cinnamon powder), రెండు టేబుల్ స్పూన్ ల గసగసాలు (Poppies), ఐదు మిరియాలు (Pepper).
 

47

తయారీ విధానం: ముందుగా పదిహేను నిముషాల పాటు బాదం గింజల్ని నానబెట్టుకుని ఆ తర్వాత పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో బాదం, జీడిపప్పు, సోంపు, పిస్తా, గసగసాలు, మిరియాలు, పావు కప్పు కాచి చల్లార్చిన పాలు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ (Grind) చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి మిగిలిన పాలు పోసి బాగా మరిగించాలి (Boil well).
 

57

పాలు బాగా మరుగుతున్నప్పుడు చక్కెర, కుంకుమ పువ్వు వేసి బాగా కలుపుకోవాలి (Mix well). పాలలో చక్కెర పూర్తిగా కరిగిన తరువాత ముందుగా మెత్తగా గ్రాండ్ చేసి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండాలి. పాలు చిక్కగా (Thickened) అయిన తరువాత చివరలో యాలకుల పొడి, దాల్చిన పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 

67

ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రెండు గంటలపాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. రెండు గంటల తర్వాత బయటకు తీసి గ్లాసులో పోసి పైన డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ (Garnish) చేసి సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం ఈ మిల్క్ షేక్ ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
 

77

ఈ మిల్క్ షేక్ ను తీసుకుంటే శరీరానికి పోషకాలు (Nutrients) అందడంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ మిల్క్ షేక్ శరీరానికి మంచి ఎనర్జీ డ్రింక్ (Energy Drink) గా సహాయపడుతుంది. ఈ మిల్క్ షేక్ ను తీసుకుంటే వేసవి కాలంలో ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.

click me!

Recommended Stories