ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

Published : Aug 29, 2023, 07:15 AM IST

ఉదయం లేవగానే గ్లాస్ నీళ్లను పక్కాగా తాగండి. ఇక మీకు కాఫీ, టీ తాగే అలవాటుంటే ఒక కప్పు బ్లాక్ కాఫీ ని మాత్రమే తాగండి. ఎందుకంటే ఇది ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.   

PREV
17
ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!
Image: Getty

పాలు, పంచదార కలిపిన టీ, కాఫీ ల కంటే బ్లాక్ కాఫీ నే మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందంటున్నారు నిపుణులు. అవును బ్లాక్ కాఫీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. బ్లాక్ కాఫీ ప్రయోజనాలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. ఏదేమైనా ఇతర వాటికంటే ఈ బ్లాక్ కాఫీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. బ్లాక్ కాఫీని తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 

27
black coffee

పుష్కలమైన పోషకాలు

బ్లాక్ కాఫీలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి 2, విటమిన్ బి 3, మెగ్నీషియం, పొటాషియం, సోడియం పుష్కలంగా ఉంటాయి. దీనిలో కేలరీలు ఉండవు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ బ్లాక్ కాఫీ మీ జీవక్రియను పెంచుతుంది. 
 

37
black coffee

అల్జీమర్స్ వ్యాధికి బ్లాక్ కాఫీ

అల్జీమర్స్ వ్యాధి అనేది మెదడు సమస్య. ఇది జ్ఞాపకాలు, ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేస్తుంది. దీనివల్ల రోజు వారి పనులను కూడా మర్చిపోతుంటాం. అయితే బ్లాక్ కాఫీ తాగడం అల్జీమర్స్ వ్యాధి ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  జర్నల్ ఆఫ్ అల్జీమర్స్ డిసీజ్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. 2-3 కప్పుల కాఫీని తాగడం వల్ల చిత్తవైకల్యం, అల్జీమర్స్ ప్రమాదం 65 శాతం తగ్గుతుందని కనుగొన్నారు. రెండు కప్పులు తాగడం వల్ల కాలక్రమేణా ఈ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

47

బరువు తగ్గడానికి బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. హార్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేసిన ఒక అధ్యయనంలో.. బరువు తగ్గడంలో బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల సానుకూల ప్రభావాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. శరీరంలో గ్లూకోజ్ ఉత్పత్తిని నెమ్మదిస్తాయని, కొత్త కొవ్వు కణాల నిర్మాణాన్ని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో మీరు సులువుగా బరువు తగ్గొచ్చు. అయితే దీనిలో చక్కెర కలపకపోతే కేలరీలు తక్కువగా ఉంటాయి.
 

57
black coffee

వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ 

జిమ్ కు వెళ్లే ముందు బ్లాక్ కాఫీ ని తాగడం వల్ల మీరు వ్యాయామాన్ని మరింత మెరుగ్గా చేసుకోగలుగుతారు. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల మీ శక్తి స్థాయిలు ఎలా పెరుగుతాయో అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ అలసటను తగ్గించి, ఏకాగ్రత ,శక్తి, పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీ వ్యాయామం సమయంలో చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వ్యాయామానికి ముందు దీనిని తీసుకోవడం మంచిది.
 

67
black coffee

డయాబెటిస్ కోసం బ్లాక్ కాఫీ

డయాబెటోలోజియా పత్రికలో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. బ్లాక్ కాపీ టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని కనుగొన్నారు. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

77
black coffee

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు

రోజుకు 2-3 కప్పుల కంటే ఎక్కువ బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది మీ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. అలాగే నిద్ర రుగ్మతలకు దారితీస్తుంది. ఇందులో కెఫిన్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లాక్ కాఫీని తీసుకోవడం వల్ల అసిడిటీ, మలబద్ధకం, నిద్రలేమి వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి రోజుకు 2-3 కప్పుల బ్లాక్ కాఫీని మాత్రమే తాగండి. 

Read more Photos on
click me!

Recommended Stories