కాకరకాయ ఇన్ని రోగాలను తగ్గిస్తుందా?

Published : Apr 11, 2023, 01:45 PM IST

కాకరకాయ రుచిలో మాత్రమే చేదుగా ఉంటుంది. కానీ దీనిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కాకరకాయను తింటే డయాబెటీస్ నుంచి మలబద్దకం వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి తెలుసా?   

PREV
16
 కాకరకాయ ఇన్ని రోగాలను తగ్గిస్తుందా?

నిజం చెప్పాలంటే కాకరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు. కారణం అది చేదుగా ఉంటుంది. కానీ కాకరకాయ చేదుగా ఉన్నా.. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కాకరకాయలో పాలీపెప్టైడ్-పి అని పిలువబడే ఇన్సులిన్ లాంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి.
 

26

డయాబెటిస్ పేషెంట్లకు ఇది ఒక గొప్ప కూరగాయ. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ, కార్బోహైడ్రేట్ల శోషణను మందగించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

36

కాకరకాయలో  ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి ఇది దివ్యఔషదంలా పనిచేస్తుంది. ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇది మలబద్ధకం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మొత్తం జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

46

కాకరకాయ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ అయిన విటమిన్ సితో పాటుగా విటమిన్లు, ఖనిజాలకు అద్భుతమైన మూలం. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాకరకాయలో పొటాషియం, ఇనుము వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి బలమైన రోగనిరోధక శక్తిని నిర్వహించడానికి చాలా అవసరం.
 

56

కాకరకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో అవసరపడతాయి. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కాకరకాయలో కేలరీల చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

66

కాకరకాయ మొటిమలను వదిలించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఇది మనల్ని చర్మ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం పొందడానికి మీ ఆహారంలో కాకరకాయను చేర్చుకుంటే సరిపోతుంది. కాకరకాయ జ్యూస్ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. దీంతో గుండెజబ్బులు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది. 

click me!

Recommended Stories