వాములో నియాసిన్, థయామిన్, సోడియం, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాము విత్తనాలలో థైమోల్ అనే ముఖ్యమైన నూనె కూడా ఉంటుంది. ఇది విత్తనాలకు మంచి సువాసనను ఇస్తుంది. రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె జబ్బులతో సహా అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో, కణాలలో కనిపించే మైనపు పదార్థం. మన శరీరంలో ఉండే ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ ను కాలెయం ఉత్పత్తి చేస్తుంది. మిగిలినది మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. అసలు వామును తీసుకుంటే ఎలాంటి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..