రోజూ పొద్దన కొద్ది దూరం నడిచినా ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?

Published : May 19, 2023, 07:15 AM IST

నడక మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. గుండె సమస్యలున్న వారికి ఇది చక్కటి వ్యాయామం కూడా.  రెగ్యులర్ గా నడిస్తే స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.   

PREV
15
రోజూ పొద్దన కొద్ది దూరం నడిచినా ఇన్ని రోగాలు తగ్గిపోతాయా?
morning walking

ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి నడక మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతుంది. అందుకే రెగ్యులర్ పొద్దున కాసేపు నడవడం అలవాటు చేసుకోవాలి. ఉదయపు నడక మన మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నడక అనేది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే వ్యాయామం. రోజూ వాకింగ్ చేయడం వల్ల జలుబు లేదా జ్వరం వచ్చే ప్రమాదం కూడా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు.
 

25

నడక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది కాలక్రమేణా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి మొత్తం రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఉదయం 30 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. ఇది కండరాలలోని కణాలు ఎక్కువ గ్లూకోజ్ ను ఉపయోగించడానికి, బొడ్డు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
 

35

మీరు హార్ట్ పేషెంట్ లేదా ఏదైనా గుండె సమస్య ఉన్నవారైతే మీకు నడక మంచి వ్యాయామం. ప్రతిరోజూ ఉదయం కాసేపు నడిస్తే స్ట్రోక్ లేదా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఉదయపు నడక గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది.

45

కీళ్ల నొప్పులను తగ్గించడానికి నడక ఉత్తమ మార్గమంటున్నారు నిపుణులు. వారానికి 5 రోజులు నడవడం వల్ల వాతం లేదా ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే శక్తిని పొందుతారు. ఉదయపు నడక కాలు, ఉదరంలోని కండరాలను టోన్ చేయడానికి సహాయపడుతుంది.

55
walk

నడక మెదడు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుందని నిరూపించబడింది. క్రమం తప్పకుండా నడవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నడక వల్ల డిప్రెషన్ తేలికపాటి నుంచి మితమైన లక్షణాలను తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది చిత్తవైకల్యం, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories