పెరుగులో అనేక విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఇతర అనేక పోషక విలువలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ఎనర్జీ బూస్టర్ (Energy booster) లా సహాయపడతాయి. పెరుగులో ఉండే ప్రోటీన్స్ (Proteins) ను శరీరం త్వరగా జీర్ణం చేసుకోగలదు. అలాగే శరీర రోగనిరోధక శక్తి కూడ పెరుగుతుంది. కనుక పెరుగును మనం తీసుకునే ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి.