Thyroid: థైరాయిడ్ తో అధిక బరువు.. తగ్గించుకునేదెలా..?

Published : Jul 30, 2022, 07:08 AM IST

మనం తీసుకునే థైరాయిడ్ హార్మోన్ కేవలం.. మన శరీరాన్ని మళ్లీ బరువు పెరగకుండా మాత్రమే కంట్రోల్ చేస్తుంది. కానీ తగ్గించదు. ఆ బరువు తగ్గించుకోవడానికి మనం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని మొదలుపెట్టాల్సిందే.

PREV
113
Thyroid: థైరాయిడ్ తో అధిక బరువు.. తగ్గించుకునేదెలా..?

ఈ రోజుల్లో ఏ ఒక్కరిని కదిలించినా.. ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు చెప్పేవారే. ముఖ్యంగా చాలా మంది మహిళలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ అనేది ఒక హర్మోన్ లోపం కారణంగా వస్తుంది. ఈ థైరాయిడ్ తో బాధపడేవారు అధిక బరువు పెరిగి.. దానిని కూడా తగ్గించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నిజానికి ఈ రోజుల్లో మనం తీసుకుంటున్న ఆహారం, చేసే వ్యాయామం, మన లైఫ్ స్టైల్ తీరును బట్టి.. బరువు తగ్గడం కాస్త కష్టంగా మారింది. అలాంటి సమయంలో.. ఇక థైరాయిడ్ లాంటి అనారోగ్యం కూడా తోడు అయితే.. అది మరింత కష్టమనే చెప్పొచ్చు. 
 

213

థైరాయిడ్ గ్రంధి జీవక్రియను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరం ఆహారాన్ని ఇంధనంగా ఎంత బాగా ఉపయోగిస్తుంది. థైరాయిడ్ తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేసినప్పుడు జీవక్రియ మందగిస్తుంది, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. వీరు ఈ అధిక బరువును తగ్గించుకోలేరు.

313

డాక్టర్ సూచించిన థైరాయిడ్ హార్మోన్ మందులు తీసుకోవడం ద్వారా, బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చు. కానీ బరువు తగ్గాలి అంటే మాత్రం మనం కొన్ని పాటించాల్సిందే. మనం తీసుకునే థైరాయిడ్ హార్మోన్ కేవలం.. మన శరీరాన్ని మళ్లీ బరువు పెరగకుండా మాత్రమే కంట్రోల్ చేస్తుంది. కానీ తగ్గించదు. ఆ బరువు తగ్గించుకోవడానికి మనం ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ని మొదలుపెట్టాల్సిందే. ఈ కింద విధంగా ఫాలో అయితే.. అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..

413

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు.. రోజులో చాలా తక్కువ ఆహారం.. ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తరచూ కొంత కొంత ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం కాకుండా.. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. దీని వల్ల వారిలో జీవక్రియ మెరుగుపడుతుంది. మాక్రోన్యూట్రియెంట్ కంటెంట్-మంచి ప్రోటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల పరంగా సమతుల్యతతో కూడిన చిన్న, తరచుగా భోజనం తినడం రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది.పెద్ద, భారీగా ప్రాసెస్ చేయబడిన భోజనం వల్ల కలిగే హెచ్చు తగ్గులను తగ్గిస్తుంది.

513
udupi food

నిజంగా మనకు థైరాయిడ్ తగ్గి... బరువు కూడా కంట్రోల్ లో ఉండాలి అంటే.. కచ్చితంగా వ్యాయామాలు చేయాల్సిందే. మన చేతిలో మరో ఆప్షన్ అనేది ఇంకోటి లేదు. నిజానికి థైరాయిడ్ తో సంబంధం లేకుండా... వ్యాయామం మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. మన శరీరం అధిక బరువును కంట్రోల్ చేయడానికి.. ఇది సహాయపడుతుంది.యోగా, లేదా వాకింగ్, జాగింగ్ ఇలా ఏదో ఒక వ్యాయామాన్ని ఎంచుకోవాలి. లేదంటే..మీ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో కార్డియోను చేర్చడం అనేది ఒక తెలివైన ఎంపిక ఎందుకంటే ఇది మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
 

613

ఈ వ్యాయామం కొద్ది రోజులు చేసి ఆపడం చేయకూడదు. కచ్చితంగా ప్రతిరోజూ చేయడం అలవాటు చేసుకోవాలి. కొద్ది రోజులు చేసి నేను బరువు తగ్గలేదుగా అని ఫిర్యాదు చేయకూడదు. దానిని మీ దిన చర్యలో భాగం చేసుకోవాలి. సమయం కుదుర్చుకొని మరీ.. వ్యాయామం చేయడం మొదలుపెడితే ఫలితం కనపడుతుంది.
 

713
exercises

ఇక బరువు తగ్గడానికి మీ రోజువారీ మొత్తం నుండి కేలరీలను తీసివేయడం ద్వారా ప్రారంభించండి. చాలా పరిమితమైన, తక్కువ కేలరీల ఆహారానికి కట్టుబడి ఉండకండి. శరీరం కేవలం కేలరీలను నిల్వ చేస్తుంది, ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. బదులుగా, మీరు వినియోగించే కేలరీల సంఖ్య, మీరు ప్రతిరోజూ ఖర్చు చేసే కేలరీల సంఖ్య మధ్య సమతుల్యతను పాటించాలి.

813
fruits

మీకు అవసరం లేని అన్ని భోజనాలను తొలగించడం అనేది మీ కేలరీల తీసుకోవడం తగ్గించడానికి ఒక సాధారణ వ్యూహం. కుక్కీలు, కేక్, సోడా, కూల్ డ్రింక్స్, స్వీట్స్ వంటి ఈ ఆహారాలన్నీ  అధిక కేలరీలను కలిగి ఉంటాయి. మీకు ఎలాంటి పోషకాహారం అందించకుండా, అవి మీకు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి.. వాటిని ముందు దూరం పెట్టాలి.
 

913


డెజర్ట్ స్థానంలో క్యాలరీలు లేని స్వీటెనర్‌తో కూడిన తాజా పండ్ల గిన్నె తినండి. సోడా స్థానంలో నిమ్మకాయ ఉపయోగించండి. బ్రెడ్, బర్గర్ , పిజ్జా లాంటి స్థానంలో తృణ ధాన్యాలు చేర్చండి. అధిక శక్తితో కూడిన ఎక్కువ భోజనం తినడం కేలరీలను తగ్గించడానికి మరొక వ్యూహం. ఒక్కో కాటుకు, ఈ ఆహారాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. అవి మీ సంపూర్ణత  అనుభూతిని పెంచుతాయి. బరువును నిర్వహించడానికి మీకు సహాయపడతాయి.

1013

బార్లీ: బార్లీలో (Barley) అధిక మొత్తంలో ఫైబర్ (Fiber) ఉంటుంది. ఇది కిడ్నీలను శుభ్రపరిచడానికి సహాయపడుతుంది. దీంతో కిడ్నీలు ప్రమాద బారిన పడకుండా ఉంటాయి. కనుక రాత్రంతా నీళ్లలో నానబెట్టిన బార్లీ గింజల నీటిని ఉదయాన్నే తాగితే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది.
 

1113
fiber

తక్కువ కేలరీలు, పోషకాహారం అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు మీ భోజనంలో ఎక్కువ భాగం ఉండాలి.  చేపలు లేదా కోడి వంటి లీన్ ప్రోటీన్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. మీ ఆహారం నుండి కార్బోహైడ్రేట్లను తొలగించవద్దు. బదులుగా మితమైన మొత్తంలో సంక్లిష్ట పిండి పదార్థాలను చేర్చండి. సాధారణ కార్బోహైడ్రేట్లను దూరంగా ఉంచండి.

 

థైరాయిడ్ కారణంగా అధిక బరువుతో బాధపడుతున్న వారు.. తమ ఆహారంలో ఫైబర్ ని భాగం చేసుకోవాలి.హైపోథైరాయిడిజం నిదానమైన జీర్ణక్రియకు కారణమవుతుంది కాబట్టి, డైటరీ ఫైబర్ ఇతర పోషకాల శోషణను నియంత్రించడంలో సహాయపడుతుంది. హైపోథైరాయిడిజం బాధితులు ఎక్కువగా మల బద్దకం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వారికి ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గిపోతుంది.
 

1213

ఇక ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటపడాలంటే.. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. దాని కోసం మంచి నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. రోజుకి ఎనిమిది ఔన్సుల గ్లాసుల నీరు తాగాలి.
 

1313
afternoon sleep

ఇక సరైన నిద్ర కూడా చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా బరువు పెరిగే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి.. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. ఇవన్నీ పాటిస్తే.. థైరాయిడ్ సమస్య నుంచే కాదు.. ఆ బరువు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories