Health Tips: బ్రకోలి ని ఆహారంగా వాడండి.. క్యాన్సర్ ని దూరం చేసుకోండి!

First Published | Oct 9, 2023, 11:00 AM IST

Health Tips: బ్రకొలీ తో క్యాన్సర్ ని దూరం పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే ఏ విధంగా క్యాన్సర్ ని దూరం పెడుతుందో, బ్రకొలీ వల్ల ఇంకెన్ని ఉపయోగాలు ఉన్నాయో ఎక్కడ తెలుసుకుందాం.
 

బ్రకొలీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్సు మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేకాకుండా ఇందులో కొవ్వు లేకపోవడం వలన డైటింగ్ చేసే వాళ్ళకి దీన్ని డాక్టర్లు ఎక్కువగా సిఫారసు చేస్తున్నారు.

 ఒక కప్పు బ్రకొలీలో ఉండే సీ విటమిన్ ఒక పండు నారింజతో సమానం. అందుకే సాధ్యమైనంత వరకు సలాడ్స్ లో తప్పనిసరిగా బ్రకోలీని చేరుస్తారు. ఇందులో విటమిన్ ఏ, బి 6, బి12, డి, కే విటమిన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

Latest Videos


 అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా ఇందులో ఎక్కువగా లభిస్తాయి.ఇందులో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఇది డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది జీరో క్యాలరీ ఫుడ్. ముఖ్యంగా బ్రకోలీలో  ప్రధానమైనది గంధక సమ్మేళనం సల్ఫో రఫేన్.

 ఈ రసాయనం రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. టైప్ టు డయాబెటిస్ మరియు ఊబకాయంతో బాధపడే వారికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా ఇవి అడ్డుకుంటాయి. అలాగే ఇవి గుండె జబ్బులు రాకుండా చూసుకోవడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

 ఫ్రీ రాడికల్స్ ఏవైతే శరీరంలో ఎక్కువగా పేరుకుపోతాయో అప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫ్రీ రాడికల్స్ ని కూడా ఈ బ్రకొలీ  సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.

అందుకే క్యాన్సర్ తో బాధపడేవారు సరియైన ట్రీట్మెంట్ తో పాటు వారి డైట్లో ఈ బ్రకొలీని ఆడ్ చేసుకోవటం మంచిది. అలాగే బాడీలో ఇంటర్నల్ గా ఉండే వాపులని తగ్గించడానికి కూడా బ్రకొలీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బ్రకొలీ మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ గా కూడా పనిచేస్తుంది.

click me!