Health Tips: పగిలిన మడమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ వంటింటి చిట్కాలు పాటించండి!

Health Tips: మడమలు పగిలిపోవడం అనేది ఒక ఇబ్బందికర సమస్య. అయితే ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
 

 సాధారణంగా మడుమల పగుళ్ళు పొడి చర్మం వల్ల వస్తుంది. తేమ లేకపోవడం కాలుష్యానికి ఎక్కువగా గురికావడం మరియు తామర, మధుమేహం, థైరాయిడ్, సోరియాసిస్ వంటి వైద్య పరిస్థితులు మడమల పగుళ్ళకి దారితీస్తాయి. అయితే ఈ పగిలిన మడమల చికిత్స కోసం ఇంటి నివారణ  ఎలాగో చూద్దాం.
 

బాదం నూనె మరియు జోజోబానూనె వంటి కూరగాయల నూనెలు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గాయాన్ని నయం చేయటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కాబట్టి రెండు టీ స్పూన్ల బాదం నూనె గాని జోజోబా ఆయిల్ గాని తీసుకొని పాదాలకి బాగా మర్దన చేయండి.


 తర్వాత మందపాటి సాక్స్ ధరించండి. ఇదంతా రాత్రి పూట చేయాలి. తర్వాత ఉదయం లేచిన వెంటనే మీ పాదాలని కడుక్కోవాలి. రోజు పడుకునే ముందు ఇలా చేయడం వలన సమస్యకి త్వరిత పరిష్కారం లభిస్తుంది. అలాగే అవకాడోలో విటమిన్ ఏ, ఈ మరియు ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్లు ఉంటాయి.

 ఇవి గాయాన్ని నయం చేయటానికి అవసరమైన పోషకాలని ఇస్తాయి. అలాగే అరటిపండు మంచి మాయిశ్చరైసర్ గా పని చేస్తుంది. ఇప్పుడు మీరు ఒక పండిన అరటి పండుని, అవకాడో పండుని అరముక్క తీసుకొని మందపాటి క్రీమ్ లా తయారు చేయాలి.
 

 దానిని మీ మడమల పైన మర్దన చేయాలి.15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో మీ పాదాలని కడగాలి. తరచుగా ఇలా చేయటం వలన పాదాల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.అలాగే పెట్రోలియం జెల్లీ కూడా..

 మడమల పగుళ్ళని తగ్గించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది పాదాల యొక్క చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది కాబట్టి  మీ పాదాలపై కొద్దిగా శ్రద్ధ పెడితే మడమల పగుళ్ళ నుంచి సత్వరమే ఉపశమనం పొందవచ్చు.

Latest Videos

click me!