ఉదయాన్నే కప్పు బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. దీంట్లో ఉండే కెఫిన్ కంటెంట్, యాంటీ ఆక్సిడెంట్లు మన ఇంద్రియాలను రీఫ్రెష్ చేస్తాయి. అలాగే తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. కానీ చాలా మంది బ్లాక్ టీకి బదులుగా పాల టీని ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పాల టీతో పోలిస్తే బ్లాక్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ టీని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty Images
గట్ ఆరోగ్యం
బ్లాక్ టీలో పాలీఫెనాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ టీలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
black tea
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది
బ్లాక్ టీని కామెలియా సినెన్సిస్ మొక్క పూర్తిగా పులియబెట్టిన ఆకుల నుంచి తయారు చేస్తారు. దీనిలో కాటెచిన్స్, థియాఫ్లేవిన్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
black tea
గుండె ఆరోగ్యం
బ్లాక్ టీలోని ఫ్లేవనాయిడ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి
బ్లాక్ టీ లో కేలరీలు, షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్లు బరువు, బిఎమ్ఐ, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీలో ఫ్లేవనాయిడ్లు ఉన్నందున.. ఇవి బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి, బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సరైన ఆహారం, వ్యాయామంతో కలిపినప్పుడు.
బ్లాక్ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించినా కొంతమంది మాత్రం దీనికి దూరంగా ఉండటమే మంచిది. రక్తహీనత లేదా ఇనుము లోపం ఉన్నవారు బ్లాక్ టీని డాక్టర్ సిఫారసు చేసిన మొత్తంలోనే తాగాలి. అలాగే దీన్ని భోజనాల మధ్య తాగాలని కూడా సిఫార్సు చేయబడింది.