ఒంటి నొప్పులు ఉన్నాయా అయితే ఈ ఎఫెక్టీవ్ టిప్స్ పాటించండి.. కొన్నిరోజుల్లోనే మంచి ఫలితం

First Published Oct 17, 2021, 6:57 PM IST

ఈరోజుల్లో అందరినీ బాధించే సమస్య ఒంటి నొప్పులు (Body Pains). చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఒంటి నొప్పులు ఉన్నాయి. 

ఈరోజుల్లో అందరినీ బాధించే సమస్య ఒంటి నొప్పులు (Body Pains). చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఒంటి నొప్పులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బిజీ కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడంతో విటమిన్లు (Vitamin's) లోపించి కీళ్ల నొప్పులు వంటి ఇతర నొప్పుల సమస్యలు వస్తుంటాయి.
 

కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, గాయాలతో వచ్చే నొప్పులు, మెడ నొప్పి వంటి జీవితకాలం (Lifetime) ఎదురుకోవాల్సి వస్తది. ఈ నొప్పులు తగ్గించడానికి మందులు వాడుతుంటారు. కానీ మందులు (Medicines) వాడడం ఒంటికి మంచిది కాదు.ఇప్పటి బిజీ కాలంలో ఆందోళన, అలసట సర్వసాధారణం.
 

 పని చేసేటప్పుడు పని మీద ధ్యాస వలన ఈ నొప్పులు (Pains) కనపడవు. కానీ విశ్రాంతి (Rest) కోసం నిద్రపోయే సమయంలో ఈ నొప్పులు చాలా వస్తుంటాయి. ఇలాంటి సమస్యలను చెక్ పెట్టడానికి ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
 

4 స్పూన్ల ఆవు నెయ్యిలో (Ghee) రెండు స్పూన్ల గోందు వేసి 2నిమిషాలు తక్కువ మంటమీద వేడి చేయాలి. వేడి చేసిన గోందును మిక్సీలో వేసి పొడి చేయాలి. గోందు మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో (Milk) కలుపుకొని తాగితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగును.
 

పాలలో ఉన్న క్యాల్షియం (Calcium) ఎముకలను ఎక్కువగా దృఢంగా పటిష్టంగా ఉండేటట్లు చేస్తుంది.శరీర అలసటను తగ్గించడానికి పసుపు (Turmaric) పాలు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూను పసుపు కలుపుకుని తాగితే నొప్పులు తగ్గుతాయి.
 

అల్లం (Ginger) రసమును నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. అల్లం వినియోగం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీర నొప్పి, వాపు మొదలైన వాటిని కూడా తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది.
 

ప్రతిరోజూ భోజనం తరువాత చిన్న బెల్లం (Jaggery) ముక్కను తీసుకుంటే మంచిది. గోరువెచ్చటి నీటిలో నానబెట్టిన ఖర్జూర (Persimmon) పండ్లను తీసుకొనుట వలన ఒంటి నొప్పులు తగ్గుతాయి. కండరాల, కీళ్ల, మెడ నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 

మనం వంటింట్లో నిత్యం వాడుకునే ఉప్పు (Salt) వలన కూడా  నొప్పులకు చెక్ పెట్టవచ్చు. ఉప్పును వేడి చేసి, ఒక వస్త్రంలో ఉంచి, నొప్పి వస్తున్న ప్రదేశంలో పెట్టాలి. ఇది శరీర నొప్పి నుంచి వెంటనే ఉపశమనం (Relief) ఇస్తుంది.

click me!