ఈ 5 వ్యాయామాలు చాలు: జిమ్‌కు కూడా వెళ్లనవసరం లేదు

First Published | Sep 19, 2024, 3:56 PM IST

మీ బిజీ జీవితంలో జిమ్ సెషన్‌లకు సమయం దొరకడం లేదా? ఫిట్‌గా ఉండటానికి మీరు ఇంట్లోనే చేయగల ఈ 5 ఎఫెక్టివ్ ఎక్సర్సైజస్(వ్యాయామాలు) గురించి ఇక్కడ తెలుసుకుందాం. వీటిని రోజూ మీరు చేయడానికి ఎలాంటి పరికరాలు కొనాల్సిన అవసరం లేదు. ఆ వ్యాయామాలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలంటూ మనం రోజూ పరుగులు పెడుతుంటాం. ఇంత హడావుడి జీవితంలో జిమ్ కోసం సమయాన్ని కేటాయించడం కష్టమనే చెప్పాలి. అందుకోసమే మీరు ఇంట్లోనే ఉంటూ ఎక్కువ స్ట్రెస్ తో చేసే వ్యాయామాల గురించి ఇక్కడ తెలుసుకోండి. ఫిట్‌గా ఉండండి. దీనికి ఎటువంటి పరికరాలు అవసరం లేదు. మీరు ఫిట్‌గా, శక్తివంతంగా ఉండటానికి ఈ 5 వ్యాయామాలు చాలా ఉపయోగపడతాయి. 
 

బాడీ వెయిట్ స్క్వాట్స్

మనం ఏ పని చేయాలన్నా కాళ్లు సహకరించాలి. నడవ లేకపోతే ఏ పనిచేయలేం కదా. అంటే కాళ్లు బలంగా ఉండాలి. శరీరం అంతా బలంగా ఉన్నా కాళ్లు పనిచేయకపోతే ఉపయోగం ఉండదు. మీ కాళ్ళు(Legs), పిరుదులను(buttocks) బలంగా చేయడానికి స్క్వాట్‌ ఎక్సర్సైజ్ మంచి ఎంపిక.

మీ వెనుకభాగాన్ని నిటారుగా ఉంచండి. మీ శరీరాన్ని కూర్చున్నట్లుగా తగ్గించండి. మీ పాదాలను భుజం-వెడల్పు దూరంలో ఉంచి నిలబడండి. ఇలా పది నుండి పదిహేను సార్లు చేయండి. మంచి రిజల్ట్స్ రావాలంటే మూడు సెట్లు చేయండి. 


పుష్-అప్స్

ఛస్ట్, భుజాలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బలవంతుడని చూడగానే తెలిసిపోతుంది. కొందరు ఎంత ఫిట్ గా ఉన్నా ఛస్ట్, హ్యాండ్స్ నార్మల్ గానే ఉంటాయి. భుజాలు, ట్రైసెప్స్, ఛాతీని పెరగాలంటే పుష్-అప్స్ చేయడం మంచిది. 

మీరు కాళ్లు, చేతులు నేలపై ఉంచాలి. మీరు ప్లాంక్ భంగిమలో ప్రారంభించినప్పుడు మీ చేతులు భుజం-వెడల్పు దూరంలో ఉండాలి. మీ ఛాతి దాదాపు నేలను తాకే వరకు మీ శరీరాన్ని కిందకి దించాలి. తర్వాత నెమ్మదిగా పైకి లేపాలి. మీ మోకాళ్లను పుష్-అప్‌లకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు. ఇలా కనీసం 10 నుంచి 15 సార్లు చేయాలి. మంచి రిజల్ట్స్ కోసం మూడు సెట్లు చేయాలి. 

ప్లాంక్

రెగ్యులర్ వర్క్స్ వల్ల శరీరంలోని అన్ని పార్టులు కదులుతాయి. కాని కొందరికి పిరుదుల్లో(buttocks) కొవ్వు మాత్రం కరగదు. ప్లాంక్ ఎక్సర్సైజ్ వల్ల పిరుదులు(buttocks) భుజాలు(shoulder) బలంగా మారతాయి. ఆ పార్టుల్లో అనవసరమైన కొవ్వు పోయి కండరాలు స్ట్రాంగ్ అవుతాయి. 

మీరు కాళ్లు, చేతులు నేలపై పెట్టి శరీరాన్ని నేలకు తాకకుండా మీ తల నుండి మీ మడమల వరకు మీ శరీరాన్ని ముంజేయి పలకలో నేరుగా ఉంచండి. అదే పొజిషన్ లో కనీసం 30 సెకన్ల నుండి 1 నిమిషం వరకు ఉండటానికి ప్రయత్నం చేయండి. 

లంగ్స్

లంగ్స్ కాళ్ళను స్ట్రాంగ్ గా ఉంచుతాయి. సమతుల్యతను పెంచుతాయి. లంగ్స్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు, మంచి అలవాట్లు కూడా ఉండాలి. సిగరెట్, ఆల్కహాల్ వంటి వాటి జోలికి పోకుండా ఉండటమే మేలు. ఊపిరి తిత్తులు స్ట్రాంగ్ గా ఉండటానికి ఈ ఉన్నతమైన భంగిమను ప్రయత్నించండి.

ముందు నిటారుగా నిలబడండి. తర్వాత ఒకే అడుగు ముందుకు వేయండి. ఆపై మీ మోకాళ్లు 90 డిగ్రీల దూరంలో ఉండే వరకు కిందకు దిగండి. మళ్లీ సాధారణ స్థితికి నిలబడండి. ఇలా కనీసం 10 నుంచి 12 సార్లు చేయండి. ఉత్తమ రిజల్ట్స్ కావాలంటే రోజుకు మూడు సెట్లు చేయండి. 

మౌంటెన్ క్లైంబర్స్

కొండలు ఎక్కేంత బలం మీ సొంతం కావాలంటే మీరు మౌంటెన్ క్లైంబ్ వ్యాయామం ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల గుండె స్ట్రాంగ్ గా మారుతుంది. శరీరంలోని అన్ని కండరాల్లో కదలిక వచ్చి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. 

దీని కోసం మీరు ముందుగా పరుగెత్తడానికి సిద్ధంగా ఉండే పొజిషన్ కి రండి. రెండు చేతుల దూరంగా పెట్టి మీ మోకాళ్లను మీ ఛాతీ దగ్గరకు తీసుకురండి. మళ్లీ వెనక్కు తీసుకెళ్లండి. ఇలా వేగంగా చేయండి. అద్భుతమైన ఈ కార్డియో వ్యాయామాన్ని 30 నుంచి 60 సెకన్ల పాటు స్థిరమైన వేగంతో చేయండి. మంచి రిజల్ట్స్ చూస్తారు. 

Latest Videos

click me!