రిలేషన్ షిప్ స్ట్రెస్ నుంచి ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వరకు.. ఇవి మీ బీపీని పెంచుతయ్ జాగ్రత్త..

Published : May 16, 2023, 10:34 AM IST

అధిక రక్తపోటు మన పాణానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. స్ట్రోక్ కూడా వస్తుంది. అందుకే దీన్ని నియంత్రణలోనే ఉంచుకోవాలి.   

PREV
17
రిలేషన్ షిప్ స్ట్రెస్ నుంచి ఫోన్ ఎక్కువగా మాట్లాడటం వరకు.. ఇవి మీ బీపీని పెంచుతయ్ జాగ్రత్త..

రక్తపోటు మన శరీరంలో రక్తం ఎంత వేగంగా రవాణా అవుతుందో చెబుతుంది. ధమనుల్లోకి రక్తం ఎంత వేగంగా వెళుతోంది. గోడలపై రక్తం ఎంత పీడనం ఉంటుందో రక్తపోటును బట్టి తెలుసుకోవచ్చు. ధమనుల ద్వారానే గుండె నుంచి మొత్తం శరీరానికి రక్తం రవాణా అవుతోంది. మన రక్తపోటు సాధారణంగా రోజంతా పెరుగుతుంది. తగ్గుతుంది. కొన్నిసార్లు రక్తపోటు చాలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన రక్తపోటు పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

27
Image: Getty

రక్తపోటును ఎలా కొలుస్తారు

రక్తపోటును 2 పద్దతుల్లో కొలుస్తారు. ఇది మీ రక్తపోటు ఖచ్చితంగా సరైనదని సూచిస్తుంది. మొదటిది సిస్టోలిక్ రక్తపోటు. ఇది మీ గుండె కొట్టుకున్నప్పుడు మీ ధమనులలో ఒత్తిడిని కొలుస్తుంది.

డయాస్టొలిక్ రెండోది. ఇది మీ గుండె బీట్ల మధ్య విశ్రాంతి తీసుకున్నప్పుడు మీ ధమనులలో ఒత్తిడిని కొలుస్తుంది. కొలత 120 సిస్టోలిక్, 80 డయాస్టొలిక్. ఇలా ఉంటే మీ బీపీ నార్మల్ ఉన్నట్టు.
 

37
Image: Getty

అధిక రక్తపోటు అంటే?

మీ ధమనుల గోడలకు వ్యతిరేకంగా రక్తం బలం స్థిరంగా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు సమస్య వస్తుంది. ఇది కాలక్రమేణా మీ ధమనులను దెబ్బతీస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.దీన్నే హైపర్ టెన్షన్ అంటారు.


ఈ సమస్యను నిశ్శబ్ద కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అధిక రక్తపోటు లక్షణాలు మొదట కనిపించవు. కానీ ఇవి లోపలి నుంచి మీ శరీరానికి హాని కలిగిస్తాయి. నిపుణుల ప్రకారం.. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. బీపీ ఎందుకు పెరుగుతుందంటే.. 
 

47
Image: Getty


మొబైల్ లో ఎక్కువ సేపు మాట్లాడటం

మొబైల్ లో ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల హైబీపీ లేదా హైపర్ టెన్షన్ కూడా వస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వారానికి 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను పరిశోధన అంచనా వేసింది. మొబైల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం.. మొబైల్ ఫోన్లలో ఎక్కువ  సేపు  మాట్లాడే వ్యక్తులకు అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువ. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ పరిశోధన నిర్వహించారు. ఇందులో 37 నుంచి 73 సంవత్సరాల వయస్సున్న  212,046 మంది పాల్గొనేవారిని అంచనా వేశారు. అయితే వీళ్లకు ఇంతకు ముందెన్నడూ అధిక రక్తపోటు సమస్య లేదు.
 

57
Image: Getty

సంబంధాల ఒత్తిడి

నిపుణుల ప్రకారం.. ఏ రకమైన ఒత్తిడి అయినా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండాలి. మాయో క్లినిక్ ప్రకారం.. ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెద్ద మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్ల వల్ల గుండె వేగంగా కొట్టుకుని రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇవి రక్తపోటును పెంచుతాయి.

ఒత్తిడితో రక్తపోటు బారిన పడ్డవారందరికీ మందును ఎక్కువగా తాగడం, కెఫిన్ తాగడం, అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం, అతిగా తినడం, చురుకుగా లేకపోవడం వంటి అలవాట్లు ఉన్నాయి. అందుకే మీ ఒత్తిడిని సకాలంలో తగ్గించుకోవాలి. 
 

67
Image: Getty

అధిక వేడి

హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం.. కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించడంలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య అనారోగ్య సమస్యలను కలిగించే రెండు అంశాలు ఉన్నాయి. అవే అధిక ఉష్ణోగ్రత, వేడెక్కడం. ఎండాకాలంలో వేడిని తగ్గించుకోవడానికి మన శరీరం చేసే ప్రయత్నాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ వేడి చర్మానికి ఎక్కువ రక్త ప్రవాహానికి కారణమవుతాయి. దీనివల్ల సాధారణ రోజుల్లో కంటే నిమిషానికి రెట్టింపు రక్తం ప్రవహిస్తూ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
 

77
Hypertension

పార్టీ ఆహారం

అప్పుడప్పుడు మీకు నచ్చినదాన్ని తినడం వల్ల ఎలాంటి సమస్యలూ రావు. కానీ అప్పుడు కూడా నచ్చిన ఫుడ్ ను లిమిట్ లోనే తినానలి. మీరు పార్టీకి వెళ్లి రక్తపోటును పెంచే అనారోగ్యకరమైన వాటిని ఎక్కువగా తినకూడదు. అలాగే ఆల్కహాల్ ను తాగడం వల్ల  కూడా రక్తపోటు పెరుగుతుంది.  మీకు అధిక రక్తపోటు ఉంటే మీరు తాగే ఆల్కహాల్ మొత్తాన్ని తగ్గించాలి. 2017 నుంచి జరిపిన పరిశోధనలో తక్కువ ఆల్కహాల్ తాగడం, ప్రతిరోజూ రెండు కంటే ఎక్కువ పానీయాలు తాగేవారిలో రక్తపోటు తగ్గడానికి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు.
 

click me!

Recommended Stories