రోగనిరోధక వ్యవస్థ బలానికి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడం చాలా అవసరం. ఇందుకోసం జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు తోడ్పడే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. ఇందుకోసం పచ్చి బఠానీలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు మొదలైన వాటిని తినండి.