ఈ మధ్యకాలంలో క్యాన్సర్ బారినపడుతున్న వారు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. మహిళలు సైతం బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడున్నారు. రకరకాల క్యాన్సర్ రకాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈమధ్య ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా చాలా కామన్ అయిపోయింది. అయితే.. మనకు తెలీకుండా మనం తీసుకునే కొన్ని ఆహారాలు, మన అలవాట్ల కారణంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. మరి ఈ క్యాన్సర్ మన దరికి రాకుండా ఉండేందుకు.. ఎలాంటి ఆహారాలు, అలవాట్లకు దూరంగా ఉండాలో నిపుణులు సూచిస్తున్నారు.