కరాచీ హల్వా (Karachi Halwa) చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో (Less ingredients) తయారు చేసుకునే ఈ స్వీట్ రెసిపీ తయారీ విధానం చాలా సులభం. సరైన కొలతలను ఫాలో అవుతూ తయారుచేసుకుంటే ఈ స్వీట్ బయట షాప్ లో దొరికే విధంగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ స్వీట్ రెసిపీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: 250 గ్రాముల మొక్కజొన్న పిండి (Corn flour), ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు (Lemon salt), ఒక కేజీ పంచదార (Sugar), 250 గ్రాముల నెయ్యి (Ghee), పావు కప్పు జీడిపప్పు (Cashew) పలుకులు, రెడ్ కలర్ (Red color).
26
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో 250 గ్రాముల మొక్కజొన్న పిండిని తీసుకుని అందులో 350ml నీళ్లు (Water) పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని (Mix well) పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద లోతుగా ఉన్న కడాయిని పెట్టి 700ml నీళ్లు పోసి అందులో ఒక కేజీ పంచదార వేసి కరిగించాలి.
36
పాకం (Caramel) మరుగుతున్నప్పుడు పైన తేట ఏర్పడితే దాన్ని తీసేయాలి. పంచదార కరిగితే చాలు పాకాన్ని ఎక్కువసేపు మరిగించరాదు. ఇప్పుడు తయారైన పాకం నుంచి సగం పాకం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాకంలో రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee) వేసుకోవాలి. అలాగే ఇందులో ముందుగా కలిపి ఉంచుకున్న మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
46
తక్కువ మంట (Low flame) మీద ఉంచి మిశ్రమం ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన పదిహేను నిమిషాల తరువాత పక్కకు తీసి పెట్టుకున్న కొంచెం పాకం, రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెయ్యిని, పాకాన్ని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పోసుకుంటూ బాగా కలుపుతూండాలి. ఇప్పుడు ఇందులో కరిగించుకున్న నిమ్మఉప్పు (Lemon salt) నీళ్లను కూడా కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలుపుకోవాలి.
56
ముఖ్యంగా కలపడం ఆపరాదు. 30 నిమిషాల తర్వాత మొక్కజొన్న పిండి నెయ్యిని పీల్చుకొని బుడగలు బుడగలుగా వస్తుంది. ఇప్పుడు పావు కప్పు జీడిపప్పు (Cashew) పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 40 నిమిషాలు పూర్తయిన తరువాత చేతిలోకి కొద్దిగా హల్వా మిశ్రమాన్ని తీసుకుని నలిపితే బాల్ గా తయారైతే హల్వా రెడీ అయినట్టు. చివరిలో కొంచెం రెడ్ కలర్ (Red color) వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.
66
ఇలా తయారైన మిశ్రమాన్ని నెయ్యి రాసిన వెడల్పాటి గిన్నెలో పోసి నాలుగు గంటలపాటు అలాగే చల్లారనివ్వాలి (Let cool). హల్వా పైన జీడిపప్పు పలుకులతో గార్నిష్ (Garnish) చేసుకోవాలి. హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన కరాచీ హల్వా రెడీ.