Fitness: ఈ టిప్స్‌ పాటిస్తే మీరు కూడా ఫుల్‌ ఎనర్జీగా ఉండొచ్చు.. పెద్ద సాహసం ఏం కాదు, చాలా సింపుల్‌

Published : Feb 03, 2025, 07:55 PM IST

పాతికేళ్ల యువత కూడా ఉసుమరంటున్నారు. రోజులో కాసేపు పనిచేస్తేనే అలసట అంటూ నిట్టూరుస్తున్నారు. అయితే 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటే ఏం చేయాలి.? ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలి.? వాటిని పాటిస్తూ ఫిట్‌గా ఉన్నా అమర్‌నాథ్‌ వాసిరెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందామా.? ఇందుకు సంబంధించి ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ మీకోసం..   

PREV
12
Fitness: ఈ టిప్స్‌ పాటిస్తే మీరు కూడా ఫుల్‌ ఎనర్జీగా ఉండొచ్చు.. పెద్ద సాహసం ఏం కాదు, చాలా సింపుల్‌
Fitness After 50

1) మిన్ను విరిగి మీద పడినా ... సాకులు చెప్పకుండా .. క్రమం తప్పకుండా...  వారానికి అయిదు రోజులు ...  రోజుకు  గంట చొప్పున జిం లో  వ్యాయామం .

2) రోజుకు 8 - 9 గంటల నిద్ర . (నేను కొత్త కారు కొనుక్కుందే నిద్ర కోసం . ఉదాహరణకు  శనివారం బాలమిత్ర ముగించుకొని బౌరంపేట్ నుంచి అమీర్పేట్ కు 2 . 30 కి బయలుదేరాను . మొత్తం యాభై నిముషాల ప్రయాణం . రిక్లైనింగ్ సీట్లో 40  నిముషాలు నిద్ర పోయా).

3) సంతులిత ఆహారం .. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ బండికి కిరోసిన్ పోస్తారు . వేడి .. పొగ తప్పించి ... వేగం ఎక్కడ వస్తుంది?  . నాది బోయింగ్ విమానం . వైట్ పెట్రోల్ మాత్రమే . ప్రోటీన్ , కాంప్లెక్స్ కార్బ్ .. అదీ తక్కువ .. గుడ్ ఫ్యాట్స్ ..  పళ్ళు   .. కాయగూరలు .. ఆకుకూరలు .. ఒమేగా ౩ .

4) నాలుగు లీటర్ల నీరు .

5) స్ట్రెస్ ను దగ్గరికి రానివ్వను .

6) పనిలో బ్రేక్స్ తీసుకొంటాను .
 

22
Health

7) చేసే పని ని ప్రేమిస్తాను .

8) పొద్దునే పనిని ప్లాన్ చేసుకొంటాను . ఈ రోజు సోమవారం .. ఈ వారం మొత్తం పని ప్లాన్ అయిపోయింది . 

9) వేళకు నిద్ర . క్రమబద్ధమయిన దిన చర్య .

10) సెల్ ఫోన్ కు బానిస కాదు . టీవీ చూడడం తక్కువ . లాప్ టాప్ ... టాబ్ పెద్దగా వాడను.

11) స్కూల్  లో పిలల్లు .. ఇంట్లో వేదాంష్..  హితాన్ష్ .. ఇంకా బ్రౌనీ .. శ్వేతా .. శ్యామా .. టిల్లు..  . ఇంకా ఫామిలీ టైం .

12) కాఫీ .. టీ .. చక్కర .. ముట్టను .

13) సంగీతం .....  శనివారం ... మొత్తం ఎనిమిది గంటల క్లాసు ..  నిన్న ఆదివారం అన్యువల్ డే ప్రోగ్రాం .. నిన్న  తెల్లవారు జామున నిద్ర లేస్తే .. ఇంకా నీరసం తగ్గలేదు . మేడపైకి వచ్చి కంప్యూటర్ రూమ్ లో ఫేస్బుక్ పోస్ట్ పెట్టి .. యూట్యూబ్ ఆన్ చేసి...  బాలు పాటలు పెట్టి అక్కడే అయిదు గంటలకు పడుకున్నా.. ఆరున్నర కు నిద్ర లేచేటప్పటికి బాడీ లో ఫుల్ ఎనర్జీ .. ఇది మేజిక్ కాదు . సైన్స్ . అన్నట్టు ఈ పోస్ట్ టైపు చేస్తుంటే .. యూట్యూబ్ లో జాము రాతిరి .. జాబిలమ్మ పాట నడుస్తోంది .. గత ఆదివారం రాత్రి తెనాలి లో ఏడున్నర దాక క్లాస్ .. సోమవారం మంగళవారం  హెడ్ క్వార్టర్స్ పని .. బుధవారం తిరుపతి .. గురువారం హెడ్ క్వార్టర్స్ .. శుక్రవారం .. ఆరుగంటల పాటు అన్యువల్ డే రిహార్సల్స్ .. శనివారం ఎనిమిది గంటల క్లాసు .. నిన్న ఆదివారం అన్యువల్ డే .. గత పదికి పైగా ఆదివారాలు డబల్ పని .. 
మా ఉద్యోగులే కళ్ళు తేలేస్తున్నారు . ఇంత ఎనర్జీ ఎలా?  అని అడుగుతున్నారు.

దానికి సమాధానమే ఈ పోస్ట్ . అందరూ ఆచరించవచ్చు . అన్నట్టు  ఒక మాట .. పైన వైట్ పెట్రోల్ అని రాసాను కదా?  అది ఖరీదు అని మీరు అనుకొంటే...  మీరు మీ నాలిక కు బానిస . అది మీతో ఆలా చెప్పిస్తోంది. వాల్ నట్స్,  ఆల్మండ్స్ తప్పించి ఏదీ ఖరీదు కాదు .

అమర్‌నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌ బుక్‌ పోస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

Read more Photos on
click me!

Recommended Stories