బాడీ ఫిట్ గా ఉండాలా.. అయితే 'సింపుల్'గా వీటిని ఫాలో అవ్వండి..!

First Published Nov 2, 2021, 3:36 PM IST

మన బాడీ ఫిట్ గా ఉండాలంటే వ్యాయామంతో పాటు సరైన ఆహారపు అలవాట్లను (Habits) చేసుకోవాలి. మనం ఎక్కువగా స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడంతో బరువు పెరుగుతాం. కానీ శరీరానికి కావాల్సిన బలం(Strength) దొరకదు. ఇలాంటి ఆహారపు అలవాట్లను మానుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి. ఈ ఆర్టికల్ ద్వారా బాడీ ఫిట్ గా ఉండటానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
 

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఎముకల బలహీనతతో (Weakness) ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం వారు తీసుకొనే ఆహారంలో సరైన పోషక విలువలు (Nutritional values) లేకపోవడమే. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి. దాంతో శరీరం బరువు పెరగకుండా ఫిట్ గా, బలంగా  ఉంటుంది.
 

మనం రోజూ తీసుకునే ఆహారంలో మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, పప్పు ధాన్యాలు, నట్స్ ను ఉండేలా చూసుకోవాలి.  వీటిని తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు చేరి  బలం (Strength) పెరుగుతుంది. అందుకు మనం రోజూ తీసుకునే ఆహారంలో సరైనపోషకాలు ఉండేలా చూసుకోవాలి. కాబట్టి బాడీ ఫిట్ (Body fit) గా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 

బాదం: బాదంలో (Almond) పీచు పదార్థం, ఒమేగా 3, ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలను (Heart problems) తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. చర్మ కణాలను రక్షించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. రోజు ఉదయం పూట  నానబెట్టిన బాదం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 

పిస్తా: పిస్తా (Pista) రోజు తినడంతో అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ప్రొటీన్లు మాంసకృత్తులు  (Proteins) ఎక్కువగా ఉంటాయి. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది గుండె ఒత్తిడిని తగ్గించి గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. నరాలకు బలాన్ని పెంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
 

పల్లీలు: పల్లీల్లో (Ground nuts) ప్రోటీన్లు, పీచుపదార్థాలు, కొవ్వులు, క్యాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఇనుము అధికంగా ఉంటాయి. పల్లీలు పిల్లల ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులను అందించి వారి శరీరానికి కావలసిన బలాన్ని అందిస్తాయి. రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. ఒక కోడిగుడ్డులో ఎంత బలం ఉంటుందో గుప్పెడు పల్లీలలో అంతే బలం ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.

click me!