పిల్లలు ఎంతగానో ఇష్టపడే క్రిస్పీ బ్రెడ్ కట్లెట్ రెసిపీ.. ఎలా తయారు చేయాలో తెలుసా?

Sreeharsha Gopagani   | our own
Published : Nov 02, 2021, 03:28 PM IST

పిల్లలకు స్నాక్స్ సమయంలో చాలా వరకు  బ్రెడ్ జాము (Bread jam) ఇస్తుంటారు. ఇలా రొటీన్ గా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా బ్రెడ్ తో కట్లెట్ చేసి ఇవ్వండి. మీ పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు. ఇది ఎంతో రుచికరమైన స్నాక్. దీన్ని సులభంగా తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ ద్వారా బ్రెడ్ కట్లెట్ (Bread cutlet) సులభంగా తక్కువ సమయంలో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..   

PREV
17
పిల్లలు ఎంతగానో ఇష్టపడే క్రిస్పీ బ్రెడ్ కట్లెట్ రెసిపీ..  ఎలా తయారు చేయాలో తెలుసా?

బ్రెడ్ కట్లెట్ రెసిపికి కావలసిన పదార్థాలు: 4 బ్రెడ్ స్లైస్ లు (Bread slides), 2ఉడికించిన బంగాళ దుంపలు (Boiled potato), కొత్తిమీర (Coriander),1 ఉల్లిపాయలు (Onion), 2 పచ్చి మిర్చి(Mirchi), కొంచెం అల్లం ముక్క (Ginger), సగం స్పూన్ జీలకర్ర (Cumin), ఒక స్పూన్  నిమ్మకాయ రసం (Lemo juice), కొంచెం గరం మసాలా (Garam masala), సరిపడు ఉప్పు (Salt) కొంచెం పసుపు (Turmeric) , తగినంత కారం (Red Mirchi Powder), రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ (Cornflour), టమోటో సాస్ (Tomato sauce), డీ ఫ్రై కి సరిపడా నూనె (Oil). 
 

27

బ్రెడ్ కట్లెట్ తయారీ విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకుని అంచులను (Edges) కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను మిక్సీలో వేసి పొడి చేయాలి. ఇలా పొడి చేసిన బ్రెడ్ పొడిని ఒక గిన్నెలోకి (Bowl) తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
 

37

బంగాళదుంపలు శుభ్రపరుచుకుని కుక్కర్ లో (Cooker) కొంచెం ఉప్పు (Salt) వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపల తొక్క తీసి బాగా చిదిమి ఒక గిన్నెలో తీసుకోవాలి.
 

47

ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో చిదిమిన బంగాళదుంప మిశ్రమాన్ని వేసి బ్రెడ్ పౌడర్ (Bread powder), సరిపడు ఉప్పు, తగినంత కారం కొద్దిగా పసుపు, అల్లం ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ ల కార్న్ ఫ్లోర్ (Cornflour) వేసి బాగా కలపాలి.
 

57

అలాగే అందులో కొంచెం గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం (Lemon juice), జీలకర్ర (Cumin seeds) వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నా బంగాళదుంప మిశ్రమాన్ని 15 నిమిషాలు పక్కన పెట్టాలి. చేతికి నూనె రాసి బంగాళాదుంప మిశ్రమాన్ని గుండ్రంగా ఒత్తుకోవాలి.
 

67

ఒక బానిల్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కాక అందులో బ్రెడ్ స్లైస్ ను నెమ్మదిగా జారనివ్వాలి. బెడ్ లైస్ లు బ్రౌన్ కలర్ (Brown colour) వచ్చేంత వరకూ తక్కువ మంట మీద రెండు వైపులా డి ఫ్రై చేసుకోవాలి. ఇలా డి ఫ్రై చేసుకున్నా బ్రెడ్ స్లైట్స్ ను ఒక ప్లేట్ లో ఉంచి టమోటా సాస్ (Tomato sauce) తో సర్వ్ చేసుకోవాలి.
 

77

అంతే రుచికరమైన క్రిస్పీ బ్రెడ్ కట్లెట్ (Crispy bread cutlet) రెడీ. ఇంకెందుకు ఆలస్యం దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై (Try) చేసి మీ పిల్లలకు పెట్టండి. ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్స్. మీ పిల్లలు దీన్ని ఎంతగానో ఇష్టపడతారు.

click me!