ఈ బ్యూటీ టిప్స్ ప్రతిరోజు పాటిస్తే అందంగా యవ్వనంగా కనిపిస్తారు... ఏంటో తెలుసుకోండి!

Navya G   | Asianet News
Published : Jan 01, 2022, 02:37 PM IST

అందరి చర్మం తీరు ఒకేలా ఉండదు. కొందరిది జిడ్డు చర్మం అయితే, మరికొందరికి పొడిచర్మం. ఇలా చర్మ తత్వాలు వేరు వేరుగా ఉంటాయి. అయితే ముఖ సౌందర్యం (Facial beauty) కోసం ఎన్ని జాగ్రత్తలు పాటించినా తగిన ఫలితం లభించక నిరాశ చెందుతున్నారు.  

PREV
18
ఈ బ్యూటీ టిప్స్ ప్రతిరోజు పాటిస్తే అందంగా యవ్వనంగా కనిపిస్తారు... ఏంటో తెలుసుకోండి!

ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముఖ సౌందర్యం తాజాగా ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా రోజూ ముఖ సౌందర్యం తాజాగా ఉండేందుకు పాటించవలసిన కొన్ని చిట్కాల (Tips) గురించి తెలుసుకుందాం..
 

28

కొందరు ఎన్ని సార్లు ముఖం శుభ్రం చేసుకున్న జిడ్డు కారుతున్నట్టు ఉంటుంది. మరికొందరికి చర్మం పొడిబారి నిర్జీవంగా (Lifeless) కనిపిస్తుంది. అయితే ఈ సమస్యలన్నింటిని నుంచి విముక్తి కలిగి నిత్యనూతనంగా, తాజాగా కనిపించడానికి ప్రత్యేక శ్రద్ధ (Special attention) అవసరం. ఈ చిట్కాలను పాటిస్తే చర్మంపై మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గి  చర్మ సమస్యలకు దూరంగా ఉండగలం. చర్మానికి  తగిన పోషకాలను అందించగలం. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం..
 

38

ఉదయం నిద్రలేవగానే టిష్యూ పేపర్ (Tissue paper) తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అప్పుడే మనం చర్మం తీరును గుర్తించగలం. దానికి అనుగుణంగా సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని మూడు సార్లు క్లెన్సింగ్ (Cleansing) చేసుకోవాలి. 

48

ముందుగా చర్మంలోని నూనెను తొలగించడానికి ముఖాన్ని ఫేస్ వాష్ (Face wash) తో శుభ్రపరుచుకోవాలి. తర్వాత స్క్రబ్ (Scrub) చేయాలి. ఆపై ఆవిరిపడితే మృతకణాలతో పాటు చర్మ రంధ్రాలలోని బ్యాక్టీరియా నశిస్తుంది. తరువాత మేకప్ వేసుకుంటే చర్మానికి మేకప్ కారణంగా ఎటువంటి హాని కలగదు.
 

58

మేకప్ వేసుకొని అలాగే నిద్రించరాదు. రాత్రి పడుకునే ముందు మేకప్ ను పూర్తిగా తొలగించి (Remove makeup completely) ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ (Moisturizer) ను అప్లై చేసుకొని నిద్రిస్తే చర్మానికి తగిన తేమ అంది ఉదయానికి ముఖ సౌందర్యం తాజాగా మారుతుంది.

68

మనం తీసుకునే ఆహార పదార్థాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకునే ఆహార పదార్థాలు మన ముఖ సౌందర్యం కూడా ప్రభావితం చూపుతాయి. కనుక ఆహార జీవన శైలిలో (Food lifestyle) తాజా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, పండ్లు సలాడ్స్ తీసుకోవడం మంచిది. ఇవి శరీర ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి (Skin beauty) కూడా పెంచుతాయి.
 

78

అదేవిధంగా రోజూ శరీరానికి తగినన్ని నీటిని (Water) అందిస్తే చర్మం ఆరోగ్యంగా (Skin health) ఉంటుంది. ఇలా ఈ చిట్కాలను పాటిస్తే మొటిమలు, మచ్చలు, ముడతలు వంటి సమస్యలు దరిచేరవు. ముఖం ఎప్పుడూ తాజాగా మెరుస్తూ, నిత్యనూతనంగా కనిపిస్తుంది. 

88

ఏ కల్మషం లేని ప్రేమ, సంపూర్ణమైన ఆరోగ్యం (Absolute health) మన చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి. ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ మనసును సంతోషంగా (Happy) ఉంచుకుంటే అంతకుమించిన ముఖ సౌందర్యం మరొకటి లేదు.

click me!

Recommended Stories