కొత్తిమీర పేస్ట్ తో అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం.. ఎలానో చూడండి?

Navya G   | Asianet News
Published : Dec 31, 2021, 04:18 PM IST

కొత్తిమీర (Coriander) ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. వంటలలో ఉపయోగించే కొత్తిమీర చర్మ సమస్యలను తగ్గించి అందాన్ని పెంచుతుంది. కొత్తిమీర చర్మ సంరక్షణకు అనేక ప్రయోజనాలను కలుగజేస్తుంది.   

PREV
16
కొత్తిమీర పేస్ట్ తో అందమైన ముఖ సౌందర్యం మీ సొంతం.. ఎలానో చూడండి?

కొత్తిమీరలో ఉండే పోషకాలు చర్మకణాలను తాజాగా ఉంచి అందాన్ని పెంచుతాయి. చర్మ సౌందర్యం (Skin beauty) కోసం కొత్తిమీర పేస్ట్ సరైనదని బ్యూటిషన్ తెలుపుతున్నారు. అయితే అందమైన ముఖ సౌందర్యం కోసం కొత్తిమీర పేస్ట్ కలిగించే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

26

కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, ఫోలేట్, విటమిన్ సి, బీటా కెరోటిన్ లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మకణాల (Skin cells) ఆక్సీకరణ ఒత్తిడిని నుంచి రక్షించి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. చర్మకణాలలోని మృతకణాలను (Dead cells) తొలగించి చర్మాన్ని తాజాగా వుంచుతాయి. చర్మంపై ముడతలను, వృద్ధాప్య ఛాయలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడతాయి. కొత్తిమీర రసం మొటిమలు, పిగ్మెంటేషన్, జిడ్డు, పొడి చర్మం, బ్లాక్‌హెడ్స్‌కు వంటి సమస్యలను తగ్గించడానికి సమర్ధవంతంగా సహాయపడుతుంది. అందమైన ముఖ సౌందర్యం కోసం కొత్తిమీర పేస్ట్ ను ఏవిధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

36

మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది: కొత్తిమీరలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతాయి. ఇందుకోసం ఒక కప్పులో కొత్తిమీర రసం (Coriander juice), నిమ్మరసం (Lemon juice), తేనె (Honey), పాలు (Milk) ఇలా వీటన్నింటిని సమాన పాళ్లలో వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గి ముఖానికి మంచి నిగారింపు అందుతుంది.  
 

46

ముడతలను తగ్గిస్తుంది: కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, వృధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయి. ఇందుకోసం ఒక కప్పులో కొత్తిమీర రసం (Coriander juice), కలబంద జెల్ (Aloevera gel) వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై ముడతలు, వృద్ధాప్య లక్షణాలు తగ్గిపోతాయి.
 

56

బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తుంది: కలుషిత వాతావరణం కారణంగా ముఖం పై ఏర్పడిన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ను తొలగించే సామర్థ్యం కొత్తిమీర రసానికి ఉంది. ఇందుకోసం ఒక కప్పు లో కొత్తిమీర రసం (Coriander juice), నిమ్మరసం (Lemon juice) వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి చర్మం తాజాగా ఉంటుంది.
 

66

చర్మాన్ని కోమలంగా మారుస్తుంది: ఒక కప్పులో రెండు టేబుల్ స్పూన్ ల పాలు (Milk), రెండు టేబుల్ స్పూన్ ల వోట్మీల్ (Oatmeal), రెండు టేబుల్ స్పూన్ ల కొత్తిమీర పేస్ట్ (Coriyander paste), ఒక స్పూన్ దోసకాయ పేస్ట్ (Cucumber paste) తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం కోమలంగా మారుతుంది.

click me!

Recommended Stories