ఆరోగ్యంతో పాటు అందాన్ని పెంచే అద్భుతమైన గింజలు ఏంటో తెలుసా?

First Published | Jan 1, 2022, 1:20 PM IST

ఆరోగ్యం (Health), అందం (Beauty) రెండూ కావాలనుకుంటే మనం తీసుకునే రోజువారీ ఆహార జీవన విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అప్పుడే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
 

కనుక మన ఆహార జీవనశైలిలో కొన్ని గింజలు చేర్చుకుంటే అవి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంచుతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా అందంతోపాటు ఆరోగ్యాన్నీ పెంచి అద్భుతమైన గింజల గురించి తెలుసుకుందాం..
 

మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు (Proteins), విటమిన్లు (Vitamins) కలిగిన గింజలను చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మానికి కావలసిన పోషకాలను అందించి చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో ఈ గింజలు తప్పనిసరి. ఇప్పుడు ఆహారంలో తీసుకోవలసిన గింజల గురించి తెలుసుకుందాం..
 

Latest Videos


పొద్దుతిరుగుడు గింజలు: ఈ పొద్దుతిరుగుడు గింజలలో (Sunflower seeds) ఉండే పోషకాలు (Nutrients) చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చర్మానికి సహజ సిద్ధమైన నిగారింపును అందించి చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. ఇవి ఆరోగ్యంతో పాటు అందానికి కూడా సహాయపడతాయి. వీటిని తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది.
 

గుమ్మడి గింజలు: గుమ్మడి గింజలలో (Pumpkin seeds) పీచుపదార్థం, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ నిగారింపును పెంచుతాయి. ఈ గింజలలో జింక్ (Zinc) పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి. కనుక వీటిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆరోగ్యం, అందం రెండూ మీ సొంతం అవుతాయి 
 

తులసి గింజలు: తులసి గింజలలో (Basil seeds) ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.   వీటిని తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక స్పూన్ తులసి గింజలను వేడి నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టి తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
 

చియా గింజలు: చియా గింజలలో (Chia seeds) ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం, క్యాల్షియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా మారుస్తాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల పనితీరును మెరుగుపరిచి రక్తపోటును (Blood pressure) నియంత్రిస్తాయి. ఇవి చర్మ సమస్యలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో చియా గింజలను చేర్చుకుంటే ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది.
 

అవిసె గింజలు: అవిసె గింజలలో (Flax seeds) క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని హార్మోన్ల (Hormones) ఉత్పత్తిని మెరుగుపరిచి గుండె సమస్యలు తగ్గుతాయి. మెదడు పనితీరును, జీర్ణక్రియ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి సహాయపడతాయి. ఒక స్పూన్ గింజలను సగం కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం తాగితే ఆరోగ్యంతో పాటు అందం కూడా మంచిది.

click me!