గర్భంతో జుట్టు ఊడిపోతుంది.. బుగ్గలపై మచ్చలు వస్తాయి.. ఈ సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి

Published : May 12, 2023, 12:05 PM IST

గర్భంతో కొంతమంది మహిళల బుగ్గలపై మచ్చలు వస్తాయి. మరికొందరికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మీకు కూడా ఇలాంటి సమస్యలొస్తే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.   

PREV
17
గర్భంతో జుట్టు ఊడిపోతుంది.. బుగ్గలపై మచ్చలు వస్తాయి.. ఈ సమస్యలు తగ్గాలంటే ఇలా చేయండి
pregnancy

ప్రెగ్నెన్సీ వల్ల ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది మహిళలు మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. మరికొందరికి ఆందోళన లక్షణాలు పెరుగుతాయి. వాస్తవానికి హార్మోన్లలో మార్పులు, మారిన పోషక అవసరాలు దీనికి ప్రధాన కారణం. ఈ రెండు విషయాలు మీ చర్మం, జుట్టుపై ప్రభావం చూపుతాయి. అందుకే గర్భధారణ సమయంలో కూడా మీ చర్మం, జుట్టు సంరక్షణపై తగినంత శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

27
pregnancy

హార్మోన్ల మార్పుల ప్రభావం

ప్రెగ్నెన్సీలో మిక్స్ డ్ ఫీలింగ్స్ ఉంటాయి. గర్భం కొన్నిసార్లు మిశ్రమ భావాలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఆనందం, ఎదురుచూపుల భావాలతో పాటుగా భయం, సందేహం భావాలు కూడా ఉంటాయి. ఇది సహజం. ఎందుకంటే గర్భంలో శరీరం, జీవన విధానంలో అనేక మార్పులు వస్తాయి. ఈ సమయంలో మహిళల శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. ముఖ్యంగా గర్భిణులకు జుట్టు, చర్మ సమస్యలు వస్తాయి. అవి తగ్గేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

37


సమస్యలు పెరగొచ్చు

ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళల చర్మం మెరుగై మెరిసిపోతుంది. ఇది హార్మోన్ల మార్పుల వల్ల వస్తుంది. అయితే కొంతమంది మహిళలకు ఈ సమయంలో కొన్ని చర్మ సమస్యలు బాగా పెరిగిపోతాయి.

సరైన పోషకాహారం

పోషకాహార లోపాలు ఉంటే చర్మంపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో పౌష్టికాహారం, తగినంత నిద్ర, విశ్రాంతి రెండూ అందానికి, ఆరోగ్యానికి చాలా అవసరం.

చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి

ప్రతిరోజూ చర్మ సంరక్షణ చేయాలి. గర్భం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. అవి సాధారణంగా బుగ్గలు లేదా నుదిటి లేదా ముక్కుపై ఎక్కువగా కనిపిస్తాయి.
 

47

సన్ స్క్రీన్ లోషన్

ఈ మచ్చలను తగ్గించడానికి, యువీ కిరణాల నుంచి రక్షణ కల్పించడానికి సన్ స్క్రీన్ లోషన్లను ఉపయోగించండి. సాధ్యమైనంత వరకు ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖానికి మసాజ్ చేసి కొంచెం క్రీమ్ ను అప్లై చేయండి. ఫేషియల్ స్క్రబ్ ఉపయోగించడం ద్వారా మచ్చలు తగ్గిపోతాయి. 

ప్రెగ్నెన్సీ గుర్తుల కోసం ఫేస్ ప్యాక్

పెరుగులో చిటికెడు పసుపు మిక్స్ చేసి రోజూ ప్యాచ్ మీద అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో కడిగేసుకోవాలి. లేదా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి రోజూ ప్యాచ్ మీద అప్లై చేయాలి. ఫేషియల్ స్క్రబ్ లేదా క్లెన్సింగ్ ధాన్యాలను ఉపయోగించండి. 
 

57

గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ

సరైన పోషకాహారం 

సాధారణంగా గర్భధారణలో హార్మోన్ల కార్యకలాపాల నుంచి జుట్టు ప్రయోజనం పొందుతుంది. డాక్టర్ సూచించిన మంచి న్యూట్రిషన్, విటమిన్, మినరల్ సప్లిమెంట్స్ జుట్టును మెరుగుపరుస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే జుట్టు రాలడంతో పాటుగా ఎన్నో సమస్యలు వస్తాయి. ప్రసవం తర్వాత కూడా కొంతమందికి జుట్టు రాలుతుంది. 

67

ఒత్తిడికి గురికావద్దు

ప్రెగ్నెన్సీ తర్వాత జుట్టు ఎక్కువగా రాలుతుంది. జుట్టు పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. హార్మోన్లు స్థిరంగా మారినప్పుడు పరిస్థితి మారుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్ గా హెయిర్ కేర్ తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి.

77
pregnancy

జుట్టు రాలడానికి హోం రెమెడీస్

వారానికి రెండు లేదా మూడు సార్లు తేలికపాటి హెర్బల్ షాంపూతో జుట్టును కడగాలి. హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించడం మానుకోండి. వీలైనంత తరచుగా జుట్టును సహజంగా ఆరనివ్వండి. గోరింటాకును వారానికి ఒకసారి అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా మారుతుంది. ఇది జుట్టును బలోపేతం చేస్తుంది.

నూనె అవసరం

వారానికి ఒకసారి నూనె రాసుకోవాలి. జుట్టుకు షాంపూ చేయడానికి ఒక రాత్రి ముందు నూనెను అప్లై చేయొచ్చు. ప్రసవం తర్వాత కూడా విటమిన్లు, ఖనిజాలను తీసుకోవాలి. 
 

click me!

Recommended Stories