కాల్షియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యం, నరాల పనితీరు, కండరాల పనితీరుకు, రక్తం గడ్డకట్టడంతో సహా ఎన్నో శారీరక విధులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ శరీరంలలో కాల్షియం సరిపడా ఉంటేనే అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ మీకు తగినంత కాల్షియం లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
శరీరంలో క్యాల్షియం తగినంత లేనప్పుడు కీళ్ల నొప్పులు, నరాల సంబంధిత వ్యాధులు, అవయవాల్లో అలసట, నిరంతర వెన్నునొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. శరీరానికి అవసరమైన కాల్షియం ఆహారం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటుగా, రక్తం గడ్డకట్టడం, గుండె లయను నియంత్రించడం, ఆరోగ్యకరమైన నరాల పనితీరు వంటి శరీర విధులలో కాల్షియం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
కాల్షియం లోపం పిల్లలు, పెద్దలలో అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాల్షియం లోపం వల్ల బాగా అలసిపోతారు. అలాగే దంతాల సమస్యలు వస్తాయి. చర్మం డ్రైగా మారుతుంది. ఇవన్నీ కాల్షియం లోపం సంకేతాలు. కాల్షియం లోపం వల్ల ఎలాంటి సమస్యలువ వస్తాయంటే..?