చిన్న వయసులో కళ్లద్దాలు వచ్చాయా? కళ్లు బాగా కనిపించాలంటే ఇలా చేయండి

First Published | Jan 30, 2024, 2:42 PM IST

ప్రస్తుత కాలంలో మన జీవనశైలి వేగంగా మారుతోంది. ఈ ప్రభావం మన ఆరోగ్యంపై చాలా కనిపిస్తుంది. అంతేకాక స్క్రీన్ టైం పెరగడం వల్ల మన కళ్లపై కూడా చెడు ప్రభావం పడుతోంది. దీనివల్ల ఎంతో మందికి చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి. ఇలాంటి వారు తమ కంటిచూపును పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

childs eyesight

ఒకప్పటి జీవనశైలికి, ఇప్పటి జీవనశైలికి చాలా తేడా ఉంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న పనిభారం వల్ల నేడు ఎంతో మంది ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ల్యాప్ టాప్, కంప్యూటర్లలో పనిచేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. దీనికి తోడూ చాలా మంది ఫోన్లకు గంటల తరబడి అత్తుక్కపోతున్నారు. దీనివల్ల  మన శరీరంపైనే కాదు కళ్ల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ అలవాటు వల్ల కళ్లు బలహీనపడతాయి. ఇది కంటిచూపును తగ్గిస్తుంది. అందుకే  నేడు ఎంతో మంది చిన్న వయసులోనే కళ్లద్దాలను వాడుతున్నారు. వీళ్లు కంటిచూపును పెంచుకోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు

మీ కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి మీరు క్రమం తప్పకుండా కంటి వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కంటి కండరాలను బలోపేతం చేయడానికి , మీ కంటిచూపును మెరుగుపరచడానికి ప్రతిరోజూ కంటి వ్యాయామాలు చేయండి. ఇందుకోసం మీరు పామింగ్, రెప్పలు కొట్టడం, మీ కళ్లను తిప్పడం వంటి వ్యాయామాలు చేయొచ్చు.
 


స్క్రీన్ సమయాన్ని తగ్గించండి

ఫోన్, ల్యాప్  టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎప్పుడూ చూడటం వల్ల మీ కళ్లు బలహీనంగా మారుతాయి. అందుకే మీ కళ్లను బలోపేతం చేయడానికి స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి 20-20-20 నియమాన్ని ఫాలో అవ్వండి. అంటే కంటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న ఏ వస్తువునైనా చూడండి. 
 

మంచి లైటింగ్

చదివేటప్పుడు లేదా పనిచేసేటప్పుడు సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. కాంతిని ఎక్కువగా ఉత్పత్తి చేసే లైట్లను నివారించండి. ప్రతిబింబాలను తగ్గించడానికి కాంతి వనరులను మీ వెనుక ఉంచండి.
 

హైడ్రేటెడ్ గా ఉండండి

ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. మీ కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం. అందుకే కంటి చూపును పెంచడానికి రోజంతా తగినంత నీటిని తాగండి. 
 

ఐవేర్

సూర్యుని హానికరమైన అతినీలలోహిత కిరణాలు కూడా మీ కళ్లను దెబ్బతీస్తాయి. ఈ కిరణాల నుంచి మీ కళ్లను రక్షించడానికి మీరెక్కడికైనా వెళ్లేటప్పుడు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించే సన్ గ్లాసెస్ ను ఖచ్చితంగా వాడండి.
 

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తినండి. జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లు కూడా ఉండేట్టు చూసుకోండి. క్యారెట్లు, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, గింజలు, చేపలు మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. 

Latest Videos

click me!