mouth ulcers
నోటి పూతల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక సాధారణ వ్యాధి. ఈ సమస్యలో నోటి సున్నితమైన పొర కణజాలం విచ్ఛిన్నమవుతుంది. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చు. కానీ చాలా మంది ఈ సమస్య గురించి అంతగా పట్టించుకోరు. నిజానికి ఇది గాయమైన మూడు లేదా నాలుగు రోజుల తర్వాత పెద్ద పుండ్లుగా మారుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని ఆహారాలు నోటి పూతలకు కారణమవుతాయి. ఆ ఆహారాలేంటంటే?
mouth ulcers
సిట్రస్ పండ్లు
ఆమ్లంగా లేదా కొద్దిగా పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల నోటి సున్నితమైన కణజాలాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది నోటి పూతలకు కారణమవుతుంది. సున్నితమైన నోటి చర్మం ఉన్నవారిలో నోటి పూతలు త్వరగా అవుతాయి. ఇలాంటి వారు పైనాపిల్, నారింజ, నిమ్మకాయ వంటి పండ్లకు దూరంగా ఉండటం మంచిది.
mouth ulcers
గింజలు
గింజలు కూడా నోటి పూతలకు కారణమవుతాయి. వీటిలో ఉండే అమైనో యాసిడ్ నోటి పూతలు అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. అలాగే గింజలను నానబెట్టకుండా అలాగే తినడం వల్ల కడుపులో వేడి పెరిగి అల్సర్లు వస్తాయి. అలాగే ఉప్పు వేసిన గింజలలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అల్సర్ కు కారణమవుతుంది. అలాగే ఇది నోటి గాయాలు, మంట ప్రమాదాన్ని పెంచుతుంది.
mouth ulcers
చాక్లెట్
చాక్లెట్లలో బ్రోమైడ్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది సున్నితమైన చర్మాన్ని మరింత ప్రభావితం చేస్తుంది. చాక్లెట్ ను మరీ ఎక్కువగా తింటే మౌత్ అల్సర్ సమస్య వస్తుంది. అందుకే చాక్లెట్ ను మితంగా తినడమే మంచిది.
mouth ulcer
స్పైసీ ఫుడ్స్
స్పైసీ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి పొరపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ ఆహారాలను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడటంతో పాటుగా నోటి పూతలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చిప్స్
సాల్ట్ స్నాక్స్, బంగాళాదుంప చిప్స్ తో సహా కొన్ని రకాల ఆహారాలు నోటి పూతలకి కారణమవుతాయి. అందుకే చిప్స్ ను మరీ ఎక్కువగా తీసుకోకూడదని నిపుణుల చెబుతున్నారు.