మీ మూత్రం బీరులా నురుగు ఏర్పడుతుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే..

Published : Jul 15, 2023, 11:37 AM IST

నిజానికి మూత్రంలో నురుగు రాదు. కానీ కొందరి మూత్రం బీరులాగే చాలా నురుగా వస్తుంది. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇలా వస్తుందంటే మీకు కొన్ని అనారోగ్య సమస్యలున్నట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.    

PREV
17
మీ మూత్రం బీరులా నురుగు ఏర్పడుతుందా? అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే..

మన మూత్రం కూడా  మన ఆరోగ్యం గురించి చెబుతుంది. అందుకే యూరిన్ టెస్టులు చేస్తుంటారు. యూరిన్ టెస్టులతో కొన్ని రోగాలను గుర్తిస్తారు. ముఖ్యంగా మూత్రం రంగు ఎన్నో వ్యాధులను సూచిస్తుంది. అయితే రంగుతో పాటుగా మీ మూత్రం బీర్ లాగా నురగ రావడం అస్సలు మంచిది కాదు. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు సంకేతమంటున్నారు నిపుణులు.
 

27

సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉండి అందులో చాలా తక్కువ నురగ ఉండాలి. అయితే కొన్ని రకాల మందులను తీసుకుంటే మూత్రం రంగు ముదురు రంగులోకి మారే అవకాశం ఉంది. అలాగే దానిలో బుడగలు కూడా ఉంటాయి. అయితే మందులను వాడటం మానేసిన వెంటనే ఈ సమస్య పోతుంది. అయితే మీరు ఏ రకమైన మందులను వాడకపోయినా దానిలో బీర్ వంటి నురుగు, బుడగలు కనిపిస్తే మాత్రం మీకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్టేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

37
kidney health

మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు

మీ మూత్రం బీర్ మాదిరిగా నురగలా ఉంటే మీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయనట్టే. మూత్రపిండాలు మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. వ్యర్థాలను మూత్రంగా మారుస్తాయి. అయితే ఈ విధానం సరిగ్గా పనిచేయకపోతే మీ మూత్రం నురుగుగా వస్తుంది. అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. మీ మూత్రంలో ఎక్కువ నురుగు కూడా మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావొచ్చు.

47
Image: Getty

ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు

ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మీ మూత్రపిండాలు రక్తాన్ని శుభ్రపరచడం కొంచెం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటికే మూత్రపిండాల వ్యాధి ఉంటే. మూత్రపిండాలు బలహీనంగా ఉంటే మీ శరీరం మూత్రంలోని ప్రోటీన్ ను బయటకు పంపుతుంది.  మీ మూత్రంలో ఎక్కువ ప్రోటీన్  ఉండే పరిస్థితిని ప్రోటీన్యూరియా అంటారు. ఇది ఎక్కువగా గర్భిణులు, ఆర్థరైటిస్, గుండెజబ్బులన్న వారిలో కనిపిస్తుంది. 
 

57
diabetes

మీకు డయాబెటిస్ ఉండొచ్చు

చోనమ్ మెడికల్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఇన్సులిన్ స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల డయాబెటీస్ పేషెంట్లకు ప్రోటీన్యూరియా సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు డయాబెటిస్ మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. దీని వల్ల మూత్రంలో నురగ ఏర్పడుతుంది.
 

67
thyroid

థైరాయిడ్ 

మూత్రపిండాలు, థైరాయిడ్ ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. మీ థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉంటే ఇది మూత్రపిండాల పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. మీకే ఏరకమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నా అది మీ థైరాయిడ్ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో ప్రోటీన్ సంశ్లేషణ, కణాల పెరుగుదలకు అవసరం. అయితే దీనిలో లోపం ఉంటే అది నేరుగా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీస్తుంది.
 

77

నిర్జలీకరణం 

మీరు నీళ్లను తక్కువగా తాగినప్పుడు.. మీ శరీరంలోని నీటిని రక్షించడానికి మీ మెదడుకు సంకేతం అందుతుంది. ఈ సంకేతంతో మూత్రపిండాలు రక్తం నుంచి తక్కువ మొత్తంలో నీటిని తొలగిస్తాయి. ఇది మూత్రాన్ని నురుగుగా చేస్తుంది. అందుకే మీ మూత్రం ఇలా కనిపించినప్పుడల్లా మీరు నీటిని పుష్కలంగా తాగాలి. మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకుంటే మీ మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తాయి. 
 

click me!

Recommended Stories