Healthy lifestyle
మీరు ఆరోగ్యంగా బతకాడానికి, దీర్ఘాయుష్షు పొందడానికి చాలా కష్టపడాలేమో అని భయపడేరు. ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మీ జీవితం ఆనందంగా ముందుగా సాగిపోతూనే ఉంటుంది. మీ ఆయుష్షును పెంచుకోవడానికి మీరు ఏమేమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
healthy life
తక్కువ ఉప్పు, చక్కెర
ఈ రెండు మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ వీటిని మోతాదుకు మించి తింటేనే లేని పోని రోగాలు వస్తాయి. ఉప్పును ఎక్కువగా తింటే రక్తపోటు సమస్య వస్తుంది. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. ఇక చక్కెర డయాబెటీస్, అధిక బరువుకు దారితీస్తాయి. ఇవి మీ ఆయుష్షును తగ్గిస్తాయి. అందుకే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలంటే మాత్రం ఖచ్చితంగా ఉప్పు, చక్కెరను బాగా తగ్గించుకోవాలి.
ఫ్రూట్ జ్యూస్
మనలో చాలా మందికి ఫ్రూట్ జ్యూస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్రూట్ జ్యూస్ లు తీయగా, టేస్టీగా ఉంటాయి. కానీ ఫ్రూట్ జ్యూస్ లను ఎప్పుడూ కూడా తాగకూడదు. ఓన్లీ పండ్లను మాత్రమే తినాలి. అలాగే మీ డిన్నర్ తేలిగ్గా ఉండేలా చూసుకోండి.
వ్యాయామం
వ్యాయామం మన శరీరాన్ని ఫిట్, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది. దీనికోసం మీరు గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. వారానికి 150 నిమిషాలు లేదా వారంలో కనీసం 5 రోజుల పాటు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేస్తే సరిపోతుంది. ఇది మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకడానికి సహాయపడుతుంది.
healthy life
ఉపవాసం
ఉపవాసం కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. మీకు దీర్ఘాయుష్షును పొందడానికి కూడా ఉపవాసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఉపవాసం సమయంలో మీరు కార్భోహైడ్రేట్లను తీసుకోకూడదు. నీళ్లను, కొబ్బరి నీళ్లను , గ్రీన్ టీని తాగొచ్చు.
వాస్తవ ప్రపంచం
చాలా మంది సెలఫోన్లలోనే గంటల తరబడి గడుపుతారు. సోషల్ మీడియాలోనే జీవిస్తారు. కానీ మొబైల్ ఫోన్లు మనల్ని వాస్తవ ప్రపంచానికి దూరం చేస్తాయి. దీనివల్ల మీరు బంధాలు, బంధుత్వాలకు చాలా దూరమవుతారు. అందుకే సెల్ ఫోన్లను అవసరానికిమాత్రమే వాడండి. అవసరం లేని సమయాల్లో వాటిని పక్కన పెట్టేసి వాస్తవ ప్రపంచంలో జీవించండి. చుట్టు పక్కల వారితో మాట్లాడండి. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతుంది.
healthy lifestyle
నిద్ర
నిద్ర మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇదే అలసిన శరీరాన్నితిరిగి రీఫ్రెష్ చేస్తుంది. ఎనర్జిటిక్ గా మారుస్తుంది. అందుకే మీరు ప్రతి రోజూ 6 నుంచి 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత బాగానిద్రపోతే మీరు అంత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది.