ప్రపంచ పొగాకులేని రోజు: పొగతాగేవారిపై కరోనా అధిక ప్రభావం, ప్రాణాలకే ముప్పు!

First Published May 31, 2021, 11:04 AM IST

పొగాకు వాడకం తగ్గించానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రచారంలో అన్ని దేశాలు పాల్గొనాలని ఆయన కోరారు. పొగాకు రహిత వాతావరణం సృష్టించడానికి ప్రజలు సైతం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. 

ప్రపంచ పొగాకు లేని దినోత్సవంగా.. ప్రతి సంవత్సరం మే31 వ తేదీని జరుపుకుంటారు. ఈ సందర్భంగా.. పొగాకు వాడటం వల్ల.. పొగతాగడం వల్ల కలిగే అనర్థాలను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పొగాకు వల్ల కలిగే నష్టాలను వివరించారు.
undefined
పొగాకు తాగేవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మిగిలినవారితో పోలిస్తే.. దాదాపు 50శాతం మంది కరోనా సోకే ప్రమాదం ఎక్కువని.. ప్రాణానికి కూడా హాని ఎక్కువ అని ఆయన తెలిపారు.
undefined
ప్రస్తుతం ఉన్న ఈ కరోనా మహమ్మారి బారినుంచి తప్పించుకోవాలంటూ.. పొగతాగడం మానేయాలని ఆయన సూచించారు. ఇది మాత్రమే కాకుండా.. పొగతాగడం వల్ల క్యాన్సర్ బారినపడే అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నారు. గుండె సంబంధిత సమస్యలు.. ఇతర అనారోగ్యాలు కూడా దరిచేరే అవకాశం ఉందని హెచ్చరించారు.
undefined
పొగాకు వాడకం తగ్గించానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రచారంలో అన్ని దేశాలు పాల్గొనాలని ఆయన కోరారు. పొగాకు రహిత వాతావరణం సృష్టించడానికి ప్రజలు సైతం తమ వంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు.
undefined
డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్... పొగాకు నియంత్రణకు కృషి చేసిన సందర్భంగా భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ , UK లోని బాత్ విశ్వవిద్యాలయంలోని పొగాకు నియంత్రణ పరిశోధన బృందానికి ప్రత్యేక గుర్తింపు అవార్డులను ఇచ్చారు.
undefined
"భారతదేశంలో ఇ-సిగరెట్లు వేడిచేసిన పొగాకు ఉత్పత్తులను (హెచ్‌టిపి) నిషేధించే 2019 జాతీయ చట్టంలో డాక్టర్ హర్ష్ వర్ధన్ కీలకపాత్ర పోషించారు" అని డబ్ల్యూహెచ్‌ఓ ఒక ప్రకటనలో తెలిపింది.
undefined
WHO ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 39% మంది పురుషులు , 9% మంది మహిళలు పొగాకును ఉపయోగిస్తున్నారు. అత్యధికంగా ఐరోపాలో పొగాకు వినియోగిస్తున్నారు.
undefined
click me!