Health Tips: మన ఆరోగ్యం మనం తినే ఆహారం లోనే ఉంటుంది. అలాంటి ఆహారం విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. అందుకే రాత్రివేళ భోజనంలో ఏం తినొచ్చో ఏం తినకూడదో చూద్దాం.
మనం ఆరోగ్యం గా ఉండటానికి ఆహారమే అసలు కారణం. అయితే ఇదే ఆహారం పద్ధతి ప్రకారం తీసుకోకపోతే మన శరీరానికి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. పగటిపూట తీసుకున్న ఆహారాన్ని రాత్రిపూట కూడా తీసుకుందాము అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే.
26
అందుకే రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదో చూద్దాం. రాత్రిపూట ఆహారంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి కాయగూరలు తీసుకోకూడదు. వీటిలో ఉండే అధిక ఫైబర్ జీర్ణం అవ్వటానికి టైం తీసుకుంటుంది అందువల్ల మీకు సరైన నిద్ర ఉండదు.
36
బీట్రూట్ తినడం వల్ల చక్కెర స్థాయిలో తక్షణమే పెరుగుతాయి అలాగే దాంట్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల రాత్రి తినకపోవడమే మంచిది. అలాగే రాత్రిపూట ఫ్రూట్ జ్యూసులు తీసుకోవటం కూడా మంచిది కాదు ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
46
రాత్రిళ్ళు కాఫీలు టీలు ఎంత దూరంగా ఉంచితే ఆరోగ్యానికి అంత మంచిది. ఈరోజు రాత్రి మనం తిన్న భోజనం తాలూకా ప్రభావం మరుసటి రోజున పడుతుందనే విషయం గ్రహించాలి. టమాటా కూడా రాత్రి త్వరగా అరగదు అందులో ఉండే సి విటమిన్ జీర్ణం కావడానికిఎక్కువ టైం తీసుకుంటుంది.
56
రాత్రిపూట వీలైనంత తక్కువ ఉప్పుని వినియోగించాలి పూర్తిగా మానేసిన పర్వాలేదు ఎందుకంటే రాత్రిపూట ఉప్పు తినడం వల్ల శరీరంలోకి మీరు ఎక్కువగా వస్తుంది అది శరీరానికి అంత మంచిది కాదు. రాత్రిపూట ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇవి జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
66
వీటితో పాటు అల్లం వంటి పదార్థాలని కలుపుకొని తింటే శరీరానికి అవసరమైన వేడిని అందిస్తుంది. ఇక చికెన్ మటన్ ఫిష్ లాంటివి రాత్రిపూట మానేయడం చాలా ఉత్తమం లేదంటే చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం మంచిది. మన శక్తికి అవసరమైన ఆహారం కన్నా ఎక్కువ తీసుకుంటే అది కొవ్వుగా మారుతుంది అన్న సంగతి గ్రహించండి.