దీపావళి సమయంలో ఆస్తమా రోగులకు ఆస్తమా తీవ్రమవుతుంది. ఎందుకంటే దీపావళి బాణసంచా వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. పొగలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సీసం, రాగి, సోడియం, పొటాషియం వంటి విష పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి. అలెర్జీలకు కారణమవుతాయి. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పెరుగుతాయి.
ఆస్తమా రోగులకు దీపావళి జాగ్రత్తలు
1. టపాసులు కాల్చినప్పుడు ఏర్పడే పొగ, రసాయనాలు శ్వాస సంబంధిత సమస్యలను పెంచుతాయి. దీన్ని నివారించడానికి వాటిని దూరంగా ఉంచడం మంచిది.
2. బయటకు వెళ్లే అవసరం ఉంటే మంచి నాణ్యమైన మాస్క్ (N95) ధరించడం ద్వారా వాయుకాలుష్యం నుండి రక్షణ పొందవచ్చు.
3. మీ శ్వాస మార్గాలను తేమగా ఉంచడానికి నీరు ఎక్కువగా తాగండి.
4. జీర్ణ సమస్యలను కలిగించే ఆస్తమాను తీవ్రతరం చేసే కొవ్వు, మసాలా ఆహారాలను మానుకోండి.