watching tv
తినేటప్పుడు టీవీ చూడొద్దని పెద్దలు చెప్తూనే ఉంటారు. దీన్ని మనం తేలిగ్గా తీసిపారేస్తాం. అలాగే టీవీనో, ఫోనో చూస్తూ తింటుంటాం. కానీ పెద్దలు చెప్పే ప్రతి మంచి మాటలకు ఏదో ఒక కారణం ఉంటుంది. అలాగే టీవీ చూస్తూ తినొద్దు అనే మాటకు కూడా బలమైన కారణమే ఉంది. అసలు టీవీ చూస్తూ ఎందుకు తినకూడదంటే?
తినేటప్పుడు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ అలవాటు మిమ్మల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. ఈ అలవాటు పెద్దవాళ్లకే కాదు పిల్లలకు కూడా ప్రమాకరమేనంటున్నారు నిపుణఉలు. ఎన్విరాన్మెంటల్ జనరల్ ఆఫ్ హెల్త్ అనే ప్రతిష్ఠాత్మక జర్నల్లో పిల్లల ఆహారపు అలవాట్లపై జరిపిన అధ్యయనంలో టీవీ చూస్తూ తినే పదేళ్ల లోపు పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది. అయితే కుటుంబంతో కలిసి తింటే ఊబకాయం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని తేలింది.
మనిషికున్న చెడు అలవాట్ల వల్లే ఎన్నో రోగాల భారిన పడుతున్నారు. ముఖ్యంగా టీవీ, ఫోన్ లు చూస్తూ తింటే చేజేతులారా జబ్బుల్ని కొని తెచ్చుకున్నట్టేనంటున్నారు నిపుణులు. టీవీ చూస్తూ తినే అలవాటు ఉన్నవారికి ఊబకాయం, కడుపు సమస్య, కళ్లు బలహీనంగా ఉండటం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. టీవీ లేదా ఫోన్ చూస్తూ తినే అలవాటు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెజబ్బులు
టీవీ లేదా మొబైల్ ఫోన్ చూస్తూ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీంతో మీ దృష్టి అంతా స్క్రీన్ పైనే ఉంటుంది. ఈ అలవాటు వల్ల మీ శరీర మెటబాలిజం తగ్గుతుంది. దీంతో మీ శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోవడం మొదలవుతుంది. దీనికి తోడు మీరు ఎంత తిన్నారో కూడా తెలియకుండా తినేస్తారు. ఇది మీరు బరువు బాగా పెరగడానికి దారితీస్తుంది. ఎక్కువ కాలం ఈ అలవాటు ఉంటే బరువు బాగా పెరిగిపోయి గుండె సమస్యలు వస్తాయి. అలాగే టైప్ 2 డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.
కడుపు సమస్యలు
ఫోన్ చూస్తే తింటే మీ దృష్టంతా స్క్రీన్ పైనే పెడతారు. దీని వల్ల మీరు యాలా త్వరగా తింటారు. అలాగే ఫుడ్ ను సరిగ్గా నమలరు. ఫుడ్ ను సరిగ్గా నమలకపోతే అజీర్థి, కడుపులో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటు మీకు చాలా కాలంగా ఉంటే ఉదర సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి.
బరువు
టీవీ చూస్తూ తినడం వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. కారణం దీనివల్ల మీరు అతిగా తినే అవకాశం ఉంది. ఫుడ్ కు సంబంధించిన యాడ్ వచ్చినప్పుడు తినాలనే కోరిక పెరిగి తక్కువ సమయంలోనే ఆకలి వేస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. క్రమం తప్పకుండా ఏదైనా తినడం వల్ల బరువు పెరిగి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
Image: Getty
నిద్రలేమి
రాత్రి భోజనం చేసేటప్పుడు టీవీ లేదా మొబైల్ ఫోన్ చూడటం వల్ల రాత్రిళ్లు మీరు కంటినిండా నిద్రపోలేరు. నిజానికి టీవీ చూస్తున్నప్పుడు తినడం వల్ల లిమిట్ కు మించి తినే అవకాశం ఉంది. దీనివల్ల కడుపులోని ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. ఈ సమస్య మీకు రాత్రంతా ఉంటుంది. దీనివల్ల మీరు కంటినిండా నిద్రపోలేరు.
obesity in children
పిల్లలు ఊబకాయం
బయోమెడ్ సెంట్రల్ జనరల్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనంలో పిల్లల్లో ఊబకాయం బాగా పెరుగుతోందని వెల్లడైంది. భారత్ లో 10 నుంచి 12 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. తినేటప్పుడు ఫోన్ లేదా టీవీ చూడటం ఇందు ఒక కారణమని నిపుణులు అంటున్నారు.