
స్త్రీ సంతానోత్పత్తిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, గర్భం నిలబడటానికి ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, పోషకాహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
గర్భధారణకు అవసరమైన విటమిన్లు
ఫోలిక్ యాసిడ్: మెదడు, వెన్నుపాము లోపాలను నివారించేందుకు సహాయపడటానికి ఇది అవసరం.
కాల్షియం: తల్లి, బిడ్డ ఇద్దరిలో బలమైన ఎముకలు, దంతాలను ప్రోత్సహిస్తుంది.
ఐరన్: రక్తం, కండరాల కణాల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు ఎదుగుదలకు తోడ్పడుతుంది.
విటమిన్ డి: ప్రెగ్నెన్సీ తర్వాత చాలా అవసరం.
ఈ విటమిన్లతో పాటు, సమతుల్య ఆహారం కూడా అంతే ముఖ్యం. అధిక బరువు లేదా పోషకాహార లోపం గుడ్డు నిర్మాణం, గర్భధారణ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. మీకు తెలుసా..? భారతదేశంలో 30 శాతం స్త్రీ వంధ్యత్వ కేసుల్లో.. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల కలిగే అండోత్సర్గము సమస్యలకు సంబంధించినవి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం పాలిసిస్టిక్ అండాశయాలు ఉన్న మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు నిర్మాణం మాత్రమే కాకుండా పిండం నాణ్యత, ఇంప్లాంటేషన్ సామర్థ్యాన్ని పోషకాహారం ప్రభావితం చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం మైక్రోబయోమ్ కు అంతరాయం కలిగిస్తుంది. అలాగే దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. ఇది ఎన్నో వంధ్యత్వ సంబంధిత వ్యాధులతో ముడిపడి ఉంటుంది. సంతానోత్పత్తి పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించండి
ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలలో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే దీనికి బదులుగా ఆలివ్ నూనెను తీసుకోండి. దీనిలో మోనో-అన్స్టారేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గింజలు, అవోకాడోలు, గ్రేప్సీడ్ ఆయిల్ వంటి మొక్కల వనరుల నుంచి వచ్చే కొవ్వులు శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని మీ సంతానోత్పత్తి ఆహారంలో చేర్చండి.
సాధారణ పిండి పదార్థాలను నివారించండి
ప్రాసెస్డ్ ఫుడ్స్, స్వీట్స్, డెజర్ట్స్, కూల్ డ్రింక్స్, జ్యూస్ లు, మైదా, అన్నం, బంగాళాదుంపలు వంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ మీ శరీరంలోని షుగర్ ను వెంటనే రిలీజ్ చేస్తాయి. ఫైబర్, బీన్స్, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు వంటి ఆహారాలను తినండి. ఇవి మీ రక్తంలో చక్కెరను నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల సమస్యలు రావు.
అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోండి
గింజలు, విత్తనాలు, కాయధాన్యాలు, శనగలు, రాజ్మా వంటి శాఖాహార వనరుల ప్రోటీన్ ను కలిగి ఉన్న అధిక ప్రోటీన్ ఆహారం మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది జంతు వనరుల ప్రోటీన్ కంటే ఉత్తమమైనది.
సీఫుడ్
సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
పాల ఉత్పత్తులను నివారించడానికి ప్రయత్నించండి
కొన్ని అధ్యయనాలు తక్కువ కొవ్వు పాలను ఎక్కువగా తాగడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని తేలింది. అందుకే వీటిని తాగకపోవడమే మంచిది. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి పాల ఉత్పత్తులలో ఉండే హార్మోన్లు అండోత్సర్గము, హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తాయని నమ్ముతారు.
యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారం
ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ పండ్లు, బీన్స్, గింజలు వంటి రంగురంగుల పండ్లు, కూరగాయల ఆహారం సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. గుడ్డు నాణ్యతను మెరుగుపరచడానికి పుచ్చకాయ, ఆస్పరాగస్ వంటి పండ్లను మీ ఆహారంలో చేర్చండి.