తిన్న వెంటనే నడిస్తే..!

Published : May 04, 2023, 02:46 PM IST

రోజుకు 10 నుంచి 15 నిమిషాల పాటు నడవడం వల్ల గుండెపోటు ముప్పు అలాగే ఇతర ప్రమాదకరమైన రోగాల రిస్క్ తగ్గుతుంది తెలుసా?   

PREV
16
తిన్న వెంటనే నడిస్తే..!
walk

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బిజీ షెడ్యూల్స్ వల్ల వ్యాయామానికి దూరంగా ఉండేవారు కూడా ఉన్నారు. కానీ వ్యాయామం మనల్ని ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దూరంగా ఉంచుతుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నడక ఈ రోగాల ముప్పును తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు లేదా పడుకోకూడదు. కానీ భోజనం చేసిన తర్వాత  చాలా మంది సోమరితనంగా, బద్దకంగా మారిపోతారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

కొన్ని నిమిషాల నడక ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. భోజనం తర్వాత రెండు నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఈ నడక సహాయపడుతుంది. భోజనం తర్వాత గ్లూకోజ్ రక్తప్రవాహంలోకి విడుదల అవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్వల్పంగా పెరుగుతాయి. మధుమేహులకు నడక ఎలా ఉపయోగపడుతుందంటే? 
 

36
walking

భోజనానంతరం నడక ఎందుకు ముఖ్యం?

బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ తాజాగా.. గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి రోజుకు 11 నిమిషాల చురుకైన నడక లేదా సమానమైన మితమైన-తీవ్రత కలిగిన శారీరక శ్రమ సహాయపడుతుందని తేల్చి చెప్పింది. 

46
walking

వారానికి 75 నిమిషాలు మితమైన-తీవ్రత కలిగిన శారీరక శ్రమను చేయడం వల్ల మరణ ప్రమాదం 23% తగ్గుతుందని వారు కనుగొన్నారు. గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని 17% తగ్గించడానికి కూడా ఇది సరిపోతుందని చెప్పారు.

56

భోజనం తర్వాత నడవడం వల్ల సెరోటోనిన్ ను కూడా విడుదల అవుతుంది. ఇది మంచి నిద్రకు, ఆకలిని నియంత్రించడానికి సహాయపడుతుంది. అంతేకాదు సానుకూల ఆలోచనలను కూడా పెంచుతుంది. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
 

66

భోజనానంతర నడక ఆరోగ్య ప్రయోజనాలు

క్రమం తప్పకుండా చిన్న నడక రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

నడక కీళ్లను బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది

మానసిక స్థితిని పెంచడానికి సహాయపడే జీవక్రియను పెంచుతుంది.

రోగనిరోధక వ్యవస్థ, కండరాలు, ఎముకలు మొదలైన వాటిని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.

రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

డోపామైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లతో సహా "సంతోషకరమైన హార్మోన్లను" విడుదల చేస్తుంది

గట్ ఆరోగ్యానికి కూడా మంచిది.
 

click me!

Recommended Stories