Diabetes: మీరు చేసే ఈ తప్పుల వల్లే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే

Published : Feb 05, 2025, 03:37 PM IST

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించిన షుగర్‌ సమస్య ఇప్పుడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని వారిలో కనిపిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా. శరరీంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయి. అయితే షుగర్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుుందాం..   

PREV
16
Diabetes: మీరు చేసే ఈ తప్పుల వల్లే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే
Diabetes

ప్రతీ ఏటా ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్‌ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్‌ కేసులు ఎక్కువుతున్నాయి. ఓ అంచనా ప్రకారం 2022లో దేశ జనాభాలో సుమారు 23.7 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. 2025 చివరి నాటికి ఈ సమస్య మరింత పెరగడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక యువతలోనూ డయాబెటిస్‌ రాడడం ఆందోళన కలిగిస్తోంది. 25 ఏళ్లలోపు యువతలో సుమారు 25 శాతం మందికి టైప్‌ 2 డయాబెటిస్‌  వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గడం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్‌ రావొద్దన్నా, వచ్చిన వారిలో షుగర్‌ లెవల్స్‌ పెరగకుండా ఉండాలన్నా కొన్ని రకాల వాటికి దూరంగా ఉండాలి. 

26
కూల్‌ డ్రింక్స్‌

డయాబెటిస్‌ ఉన్నవారు, రాకుండా ఉండాలనుకునే వారు ఎట్టి పరిస్థితుల్లో కూల్‌ డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 

36
వైట్‌ రైస్‌:

కార్బోహైడ్రేట్‌ ఎక్కువగా ఉండే వైట్‌ రైస్‌ను కూడా తక్కువగా తీసుకోవాలి. దీనివల్ల రక్తంలో షుగల్ లెవల్స్‌ పెరుగుతాయి. అన్నానికి బదులుగా కొర్రలు, అరికలు వంటి సిరి ధాన్యాలను తీసుకుంటే మంచిది. 

46
డీప్‌ ఫ్రై:

ఇక షుగర్‌ పేషెంట్స్‌ దూరంగా ఉండాల్సిన మరో ఆహారం డీప్‌ ఫ్రైలు. చిప్స్‌, ఫ్రెంచ్‌ ఫ్రైలు, చికెన్‌ ఫ్రైకి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగి, శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలు పెరుగుతాయి. ఇది కూడా షుగర్‌ లెవల్స్‌ పెరగడానికి కారణమవుతుంది. 
 

56
కేకులు:

కేకులు, కుక్కీలు, పేస్ట్రీలు వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి బదులుగా తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 

66
ఆల్కహాల్‌:

షుగర్‌తో బాధఫడేవారు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. రెగ్యులర్‌గా ఆల్కహాల్‌ తీసుకునే వారిలో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందుకు బదులుగా చక్కెర తక్కువగా ఉండే జ్యూస్‌లను తీసుకోవాలి.

గమనిక: పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధిచి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Read more Photos on
click me!

Recommended Stories