ఉబ్బరం తగ్గాలా? అయితే ఇలా చేయండి..

Published : May 06, 2023, 07:15 AM IST

హెవీగా తిన్న తర్వాత కడుపు ఉబ్బరం కలుగుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే కొన్ని మూలికలు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
16
ఉబ్బరం తగ్గాలా? అయితే ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. కడుపు ఉబ్బరానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయినప్పటికీ చాలా మందికి ఈ సమస్య హెవీగా తిన్న, త్వరగా తిన్నా, ఉప్పుగా ఉండే ఆహారాన్ని తిన్నా వస్తుంది. మీ గట్ లో వాయువు ఏర్పడటం, అసమతుల్య పేగు బ్యాక్టీరియా, పుండ్లు, మలబద్ధకం, పరాన్నజీవి ఇన్ఫెక్షన్లతో సహా అనేక అంశాలు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని మూలికలతో ఈ ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటంటే..?
 

26

సోంపు గింజలు

భారతీయ వంటకాల్లో తరచుగా ఉపయోగించే ఈ విత్తనాలలో కండరాలను సడలించడానికి సహాయపడే యాంటీస్పాస్మోడిక్ సమ్మేళనాలు అనెథోల్, ఫెంకోన్, ఎస్ట్రాగోల్ పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలలో పేగుల కండరాలను బిగించే శోథ నిరోధక లక్షణాలు కూడా ఉంటాయి. వీటిని తింటే ఉబ్బరం వెంటనే తగ్గుతుంది. 
 

36
ginger

అల్లం

ఉబ్బరాన్ని తగ్గించడానికి అల్లం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గుండెల్లో మంటను తగ్గించడానికి సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లంలో జింజెరోల్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి కడుపు ఖాళీని వేగవంతం చేస్తాయి. అలాగే గ్యాస్, ఉబ్బరంను తగ్గిస్తాయి.

46
peppermint

పుదీనా

పుదీనా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి బాగా సహాయపడుతుంది. ఇది ఉబ్బరం, వాయువు, కదలిక, ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేయడానికి సహాయపడుతుంది.
 

56

వాము

వాములో పినిన్, లిమోనేన్, కార్వోన్ వంటి అస్థిర సమ్మేళనాల సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. వాము జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
 

66

జీలకర్ర 

జీలకర్రలో ఆల్డిహైడ్, సైమెన్, ఇతర టెర్పెనాయిడ్ రసాయనాలతో సహా అస్థిర నూనెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఉబ్బరం నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. గ్యాస్,  కడుపు నొప్పిని త్వరగా తగ్గిస్తాయి. జీలకర్ర వాటర్ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. 

click me!

Recommended Stories