నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చల్లటి నీరు జీవక్రియ రేటును పెంచుతుంది. జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తగినంత నీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుందని కనుక్కున్నారు.
కేలరీలను తగ్గిస్తుంది
ఇతర డ్రింక్ లకు బదులు నీరు తాగడం వల్ల కేలరీలు తీసుకోవడం కూడా తగ్గుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో నిర్వహించిన ఒక అధ్యయనంలో భోజనానికి ముందు అరలీటర్ నీరు తాగడం వల్ల కేలరీల తీసుకోవడం తగ్గుతుందని తేలింది.