ఒత్తిడితో తెల్లజుట్టు.. నిజమే.. తాజా అధ్యయనం..

First Published Jun 30, 2021, 1:23 PM IST

కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం, ఒత్తిడి, జుట్టు నెరవడం ల మధ్య ఖచ్చితంగా సంబంధం ఉందని తేలింది.వాగేలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతుందనే విషయానికి సంబంధించిన పక్కా ఆధారాలను కనుగొన్నారు.

కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం, ఒత్తిడి, జుట్టు నెరవడం ల మధ్య ఖచ్చితంగా సంబంధం ఉందని తేలింది.వాగేలోస్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మానసిక ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతుందనే విషయానికి సంబంధించిన పక్కా ఆధారాలను కనుగొన్నారు.
undefined
ఈ ఫలితాలు eLife జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. ఒత్తిడివల్ల జుట్టు తెల్లడడం వేగవంతం అవుతుందని సహజంగా అనిపించినప్పటికీ, ఒత్తిడి తగ్గినప్పుడు హెయిర్ కోలన్ పునరుద్ధరించబడడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఎలుకలలో ఇటీవల జరిగిన అధ్యయనానికి విరుద్ధంగా ఇది కనుగొనబడింది. ఎలుకల అధ్యయనంలో ఒత్తిడి వల్ల వచ్చిన తెల్ల వెంట్రుకలు శాశ్వతంగా ఉంటాయని తేలింది.
undefined

Latest Videos


జుట్టు తెల్లబడడం, ఒత్తిడి గురించి ఊహాగానాలకు దృవీకరించడానికి ఈ అధ్యయనం బాగా సహాయ పడుతుందని అధ్యయనం సీనియర్ రచయిత మార్టిన్ పికార్డ్ అన్నారు.
undefined
తెల్లవెంట్రుకలు, మళ్లీ అవి నలుపుగా మారడానికి మధ్య యంత్రాంగాలను అర్థం చేసుకోవడం వల్ల సాధారణంగా మనుషుల్లోని వృద్ధాప్య లక్షణాలను ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుందనే దాని గురించి కొత్త ఆధారాలు లభిస్తాయి"అని పికార్డ్ తెలిపారు.
undefined
"మా డేటా ప్రకారం మనుషుల్లో వృద్ధాప్యం ఒక సరళ, స్థిర జీవ ప్రక్రియ కాదని నిరూపిస్తుంది, ఇది కొద్ది కాలానికి ఆగిపోవచ్చు. లేదా రివర్స్ అవ్వచ్చు... అని పికార్డ్ తెలిపారు.
undefined
వృద్ధాప్యం మీద పరిశోధనలకు ఒక అద్భుతమైన మార్గంగా జుట్టు మీద అధ్యయనం చేశాం. చెట్టు కాండంలోని వలయాల ఆధారంగా దాని వయసును అంచనా వేసినట్టుగానే.. మానవ జుట్టు జీవ చరిత్రకు సంబంధించిన సమాచారం ఉంటుంది" అని పికార్డ్ చెప్పారు.
undefined
"వెంట్రుకలు ఇంకా ఫోలికల్స్ స్థాయిలో ఉన్నప్పుడు వాటిమీద ఒత్తిడి హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనస్సు , శరీరంలో జరుగుతున్న ఇతర విషయాలు.. జుట్టు పెరుగుతున్నకొద్దీ ప్రభావితం చేసి శాశ్వతమైన తెల్లరంగుగా మార్చేస్తాయి.
undefined
వయసు కంటే ముందే జుట్టు తెల్లబడుతున్నట్లైతే అది ఒత్తిడి వల్లే. ఒత్తిడిని తగ్గించడం వల్ల ఆ జుట్టు తిరిగి తన పూర్వ రంగును సంతరించుకుంటుందని వీరి అధ్యయనంలో తేలింది.
undefined
మధ్యవయసువారిలో ఇది బాగా కనిపిస్తుంది. అయితే ఇదే 70యేళ్ల వయసువారిలో కూడా ఇలాగే జరుగుతుందా అనేది తెలియదు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యానికే కాదు.. జుట్టు అందానికి, ఆరోగ్యానికి కూడా మంచిది.
undefined
click me!