ఈ చర్మవ్యాధులూ కోవిడ్ లక్షణాలే.. తాజా అధ్యయనం..

First Published May 6, 2021, 1:12 PM IST

కోవిడ్ శరీరంలోని కీలకమైన అవయవాలమీద ప్రభావంతో పాటు బాహ్యంగా శరీరంమీద కూడా దాని లక్షణాల్ని చూపిస్తుందని, వీటిని గమనిస్తే ఆదిలోనే చికిత్సతో కరోనా ప్రమాదం నుంచి బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు.  

కరోనా వైరస్ సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకూ వైరస్ రూపు మార్చుకుంటూ... కొత్త కొత్త లక్షణాలతో కలవరపెడుతోంది. వైరస్ లో జరిగిన మ్యూటేషన్ కారణంగా సెకండ్ వేవ్ లో లక్షణాలు భిన్నంగా ఉన్నాయని వీటిని పట్టించుకోకపోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
undefined
జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస ఇబ్బందులు ఇలాంటివే కరోనా లక్షణాలుగా పరిగణిస్తున్నారు. అయితే చాపకింద నీరులా కరోనా అనేక ముందస్తు లక్షణాల్ని చూపిస్తోందని వాటి విషయంలో అలర్ట్ గా లేకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
undefined
కోవిడ్ శరీరంలోని కీలకమైన అవయవాలమీద ప్రభావంతో పాటు బాహ్యంగా శరీరంమీద కూడా దాని లక్షణాల్ని చూపిస్తుందని, వీటిని గమనిస్తే ఆదిలోనే చికిత్సతో కరోనా ప్రమాదం నుంచి బయటపడొచ్చని సలహా ఇస్తున్నారు.
undefined
SARS-COV-2 వైరస్ మ్యూటెంట్ ఇప్పుడు స్కిన్ ఇన్ఫెక్షన్ అనే లక్షణాన్నీ సంతరించుకుందని తేలింది. కొన్నిరకాల చర్మవ్యాధి లక్షణాలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు మీకు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయద్దని హెచ్చరిస్తున్నారు. అవేంటో చూడండి...
undefined
మొదటిది చర్మం మీద అక్కడక్కడ మంట పుట్టడం. ఇది ఒక సంకేతం. కాగ గోళ్ల మీద నిలువుగా గీతలాగా ఏర్పడడం కూడా మరో సంకేతం అంట.
undefined
ఈ గోరు సంకేతం వల్ల వారికి అప్పటికే వైరస్ సోకిందన్న విషయం తెలుపుతుందని కొత్త అధ్యయనాలు ఇప్పుడు హెచ్చరిస్తున్నాయి.
undefined
కోవిడ్ వల్ల కాలి వేళ్లు ఇన్షెక్షన్ గురించి చాలా కాలం నుంచి చర్చల్లో ఉన్నదే.. అయితే ఇప్పుడు దీన్ని ఈ అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. కాలి గోర్ల చుట్టూ ఎర్రటి కురుపుల్లా ఏర్పడడం కోవిడ్ లక్షణమే.. అని కోవిడ్ సోకిందన్న దానికి నిదర్శనమని అంటున్నారు.
undefined
వైరస్ సంక్రమణకు మొదటి గుర్తులు చర్మం మీద ఏర్పడే ఈ లక్షణాలే. వీటి గురించి కొత్త అధ్యయనాలు జరుపుతున్నప్పుడు గోళ్లపై కనిపించే గీతలు, లేదా మరకలు, కాలి వేళ్ల మీద నీలిరంగులో ఏర్పడే మచ్చలు, వాటితో నొప్పి ఇవన్నీ వైరస్ సోకిందన్నదానికి సంకేతాలే అని తేలింది. ఇక జుట్టు విషయంలో తేడాలు కూడా మీకు కరోనా సోకిందా లేదా అనేది తెలుపుతుందని అంటున్నారు.

చర్మం మీద దద్దుర్లు, బొబ్బలు ఏర్పడడం. శరీరం మీద అక్కడక్కడ ఏర్పడిన దద్దుర్లతో దురద, మంట ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి కోవిడ్ 19 లక్షణాల్లో ఒకటి కాబట్టి.. ఇలా వచ్చినప్పుడు మామూలే అని నిర్లక్ష్యం చేయకూడదు.
undefined
ఈ దద్దుర్లు శరీరంలోని ఏ భాగంలోనైనా ఏర్పాడవచ్చు. చేతులు, కాళ్లు, మెడ వెనుక, తొడలు.. ఎక్కడ కనిపించినా అలర్ట్ అవ్వాల్సిందే. కరోనా వైరస్ ధమనులు, సిరల మీద దాడి చేయడం ప్రారంభించినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ దద్దుర్లు ఎర్రగా, దురదతో కూడి ఎత్తుఒంపులతో ఉంటాయి.
undefined
కొన్నిసార్లు, శరీరంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు పాచీ రంగు లేదా చర్మం పాలిపోయినట్టు కనిపిస్తుంది. చర్మం మీద మంటలు లేదా కాలి వేళ్ళ చుట్టూ ఎర్రటి, వంగపండు రంగు గడ్డల రూపంలో ఏర్పడి మంట ఉంటుంది. మెడ, ఛాతీ భాగంలో తామరలాంటివి కనిపిస్తాయి.
undefined
ఉర్టికేరియా లేదా అసాధారణ రీతిలో శరీరం మీద దద్దుర్లు కనిపించడం కూడా కోవిడ్ 19 లక్షణమే. మామూలు దద్దుర్లైతే గంటల్లో తగ్గిపోతాయి. కానీ ఇవి తొందరగా పోవు. బాధకలిగిస్తాయి. గడ్డల్లాగా ఏర్పడతాయి. వైరస్ వచ్చిపోయిన చాలాకాలం తరువాత కూడా ఈ లక్షణాలు బైట పడొచ్చని అంటున్నారు.
undefined
పెదవులు పొడి బారి పోవడం.. : ఒక వ్యక్తికి కోవిడ్ సోకిందనడానికి మరో ఉదాహరణ పెదవులు పొడి బారి పోవడం, నోటి పూత రావడం కూడా. అయితే పెదాలు పొడిబారిపోవడం డీ హైడ్రేషన్ వల్ల కూడా అయ్యే అవకాశం ఉంది.
undefined
అంతేకాదు ఆల్రెడీ మీకు వైరస్ నుంచి కోలుకుంటే ఆ క్రమంలో మీరు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. పెదాలు నీలిరంగులోకి మారిపోవవడం, చర్మం పాలిపోవడం లాంటివి గమనిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
undefined
చర్మం సున్నితంగా మారిపోవడం. సెకండ్ వేవ్ లో కరోనా లక్షణాలు అనేకంగా ఉంటున్నాయి. ఇందులో ఒకటి చర్మం సున్నితంగా మారిపోవడం. పాజిటివ్ రోగుల్లో ఎక్కువగా పొత్తికడుపు దగ్గర సున్నితత్వం ఏర్పడుతోంది.
undefined
దీంతో వారికి బట్టలు సరిగ్గా ధరించడం కూడా కష్టమవుతుంది. దురద, అసౌకర్య అనుభూతి, దీనివల్ల మంట ఇవన్నీ కోవిడ్ లక్షణాలే అంటున్నారు.
undefined
জলের অভাবেও ঠোঁট শুষ্ক হয়। আর শীতকালে জল কম খাওয়া হয় যায়। তাই সুন্দর ও নরম ঠোঁটের জন্য পর্যাপ্ত পরিমাণে জল পান করা অবশ্যই জরিরি। এ ছাড়াও, ঘরোয়া কিছু টোটকা আছে, যা মেনে চললে ঠোঁট হয়ে উঠবে নরম, তুলতুলে ও ফিরে পাবে তার গোলাপি আভা।
undefined
స్కిన్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్ రెండు లక్షణాలూ ఒక్కలాగే ఉన్నప్పుడు వీటి మధ్య తేడాలు కనిపెట్టడం ఎలా?దీనికి నిపుణులు ఏం చెబుతున్నారంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు జాగ్రత్తగా వాటి లక్షణాలను గమనించమంటున్నారు. మొదట స్కిన్ ఇన్ఫెక్షన్ ఏర్పడి ఆ వెంటనే జ్వరం, దగ్గు లాంటివి వచ్చాయంటే అది కచ్చితంగా కోవిడేనని.. ఒకసారి తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.

click me!