టాయ్ లెట్ ప్లష్ తో కరోనా వ్యాప్తి...? దీనిలో నిజమెంత?

First Published May 6, 2021, 11:35 AM IST

టాయ్ లెట్ ఉపయోగించిన తర్వాత మనం ఫ్లష్ నొక్కడం చాలా కామన్. కాగా.. అలా నొక్కే సమయంలో.. దానిని టచ్ చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా.. లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కాగా.. ఈ విషయంపై నిపుణులు సైతం పరిశోధనలు నిర్వహించారు.

కరోనా సెకండ్ వేవ్ తో దేశంలో అల్లకల్లోలం అయిపోతోంది. మొదటి వేవ్ లో ఉన్న రికవరీ రేటు.. ఈ సెకండ్ వేవ్ లో కనపడటం లేదు. కేసులకు కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి.. అదే రేంజ్ లో మరణాలు కూడా నమోదౌతున్నాయి. అంతెందుకు.. దీని తర్వాత థర్డ్ వేవ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భయం మరింత పెరిగిపోతోంది.
undefined
కాగా.. గత కొంతకాలంగా కరోనా ఏవిధంగా ఎక్కువ వ్యాప్తి చెందుతుందో తెలియజేస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాటిలో.. ఒక పోస్టు ఈ మధ్య జనాలను విపరీతంగా భయపెట్టింది. దానిలో ఏముందంటే... టాయ్ లెట్ ప్లష్ ద్వారా కరోనా వ్యాప్తి చాలా ఎక్కువ వేగవంతంగా సాగే అవకాశం ఉంది అనేది దాని సారాంశం.
undefined
టాయ్ లెట్ ఉపయోగించిన తర్వాత మనం ఫ్లష్ నొక్కడం చాలా కామన్. కాగా.. అలా నొక్కే సమయంలో.. దానిని టచ్ చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందా.. లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. కాగా.. ఈ విషయంపై నిపుణులు సైతం పరిశోధనలు నిర్వహించారు.
undefined
తాజాగా.. ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే పత్రికలో దీనిపై ఓ కథనం కూడా ప్రచురితమైంది. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించాలంటే టాయిలెట్ల ద్వారా జరుగుతున్న వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం అత్యంత ముఖ్యమని తాజాగా ప్రచురితమైన ఫిజిక్స్ అఫ్ ఫ్లూయిడ్స్ అనే సైన్స్ జర్నల్ పేర్కొంది.
undefined
ముఖ్యంగా "టాయిలెట్ ని ఫ్లష్ చేసినప్పుడు వేగంగా నీరు టాయిలెట్ బౌల్ లోకి వెళ్తూ కలిగించే ప్రెజర్ వల్ల ఈ వైరస్ క్రిములు గాల్లోకి చేరి అక్కడి నుండి వ్యాపిస్తాయా..?" అనే అంశం మీద జరిగిన రీసెర్చ్ ని ఈ జర్నల్ లో ప్రచురించారు.
undefined
ఈ పరిశోధనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు 40 నుంచి 60 శాతం వైరస్ క్రిములు టాయిలెట్ బౌల్ నుండి గాల్లోకి చేరి ఎక్కువ ప్రదేశంలో వ్యాప్తి చెందుతాయని, తద్వారా కరోనా వైరస్ మరింత ఎక్కువ ప్రదేశంలో వ్యాప్తి చెందే ఆస్కారం ఉంటుందని గుర్తించారు.
undefined
అంతే కాకుండా టాయిలెట్ బౌల్ లో కూడా వైరస్ క్రిములు చాలా సేపటి వరకు ఉంటాయని, అలా కూడా ఒక కరోనా సోకిన రోగి ఉపయోగించిన టాయిలెట్ ని వేరే ఇతర ఆరోగ్యకరమైన వ్యక్తి వాడితే వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది కాబట్టి, టాయిలెట్ ని ఇన్ఫెక్షన్ సోర్స్ గానే పరిగణించాల్సి ఉంటుందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
undefined
click me!