కరోనా సోకిన తల్లులు.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చా...?

First Published May 6, 2021, 10:46 AM IST

తల్లి తన బిడ్డకు ఇవ్వగల అత్యంత పోషకమైన ఆహారాలలో రొమ్ము పాలు ఒకటి. నీటితో పాటు, కొవ్వులు, పిండి పదార్థాలు, ఖనిజాలు, ఐరన్, కాల్షియం, భాస్వరం, సోడియం మరియు విటమిన్ ఎ, సి  డి ఉన్నాయి. 
 

కరోనా మహమ్మారి వికృతరూపం దాలుస్తోంది. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సంవత్సర కాలంగా ఇది మనల్ని పట్టిపీడిస్తున్నా.. దీనిపై అనేక సందేహాలు కలుగుతూనే ఉన్నాయి.
undefined
దేశంలో ప్రతిరోజూ 3లక్షలకు పైగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. వారిలో గర్భిణీ స్త్రీలు.. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. కరోనా సోకిన తల్లి.. బిడ్డకు పాలివ్వచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో కలుగుతోంది. అయితే... తల్లి పాలు బిడ్డకు చాలా అవసరం
undefined
కరోనా ఉంది కదా అనే భయంతో బిడ్డకు పాలివ్వడం ఆపవద్దని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాల ద్వారా బిడ్డకు కరోనా వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. కాబట్టి.. ఎలాంటి భయం లేకుండా బిడ్డకు తల్లి పాలు ఇవ్వొచ్చట. ఆ పాల ద్వారా బిడ్డకు రోగనిరోదశక శక్తి లభిస్తుందని వారు చెబుతున్నారు.
undefined
తల్లి తన బిడ్డకు ఇవ్వగల అత్యంత పోషకమైన ఆహారాలలో రొమ్ము పాలు ఒకటి. నీటితో పాటు, కొవ్వులు, పిండి పదార్థాలు, ఖనిజాలు, ఐరన్, కాల్షియం, భాస్వరం, సోడియం మరియు విటమిన్ ఎ, సి డి ఉన్నాయి.
undefined
నవజాత శిశువులకు వారి రోగనిరోధక శక్తిని అధికంగా ఉంచడానికి బ్రెస్ట్ మిల్క్ ఉత్తమమైన ఏకైక పోషక వనరు. ఇది ప్రాణాంతక వైరల్ సంక్రమణ నుండి వారిని కాపాడుతుంది.
undefined
ఆరునెలల లోపు పిల్లలకు కచ్చితంగా తల్లిపాలు తప్పనిసరి. తల్లికి వైరస్ సోకినా.. జ్వరం వచ్చినా.. బిడ్డకు ఎలాంటి భయం లేకుండా పాలు ఇవ్వొచ్చు.
undefined
ఇది మీ పిల్లల రోగనిరోధక శక్తి విషయానికి వస్తే అంతిమ అమృతం లాంటిది. రోగనిరోధక శాస్త్రంలో ఫ్రాంటియర్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, తల్లి పాలు సహజమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది.
undefined
అయితే.. మూతికి మాస్క్ ధరించడం.. చేతికి శానిటైజర్ వాడటం... గ్లౌజులు వేసుకోవడం లాంటి జాగ్రత్తలు మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
undefined
click me!