మీ శరీరంలో ఇలాంటి మార్పులొస్తే జాగ్రత్త పడండి.. అది క్యాన్సర్ సంకేతం కావొచ్చు

First Published | Oct 19, 2023, 7:15 AM IST

క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. దీనికి సకాలంలో చికిత్స తీసుకుంటేనే బతికే అవకాశాలుంటాయి. అందుకే దీనిని ప్రారంభ దశలో గుర్తించాలి. క్యాన్సర్ ను స్టార్టింగ్ లో గుర్తించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. వీటిని గుర్తిస్తే చికిత్స తీసుకుని పూర్తిగా తగ్గించుకోవచ్చు. 
 

క్యాన్సర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది మనిషి ప్రాణాలను ఈజీగా తీసేయగలదు. అందులోనూ ఇది మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ వ్యాధిని మొదట్లో గుర్తిస్తే ప్రాణాలతో బయటపడొచ్చు. కానీ చాలా మంది దీన్ని లాస్ట్ స్టేజ్ లోనే గుర్తిస్తారు. లాస్ట్ స్టేజ్ లో గుర్తించినా ఎలాంటి లాభం ఉండదు. అందుకే క్యాన్సర్ గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. 

క్యాన్సర్లు ఎన్నో రకాలు. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఈ క్యాన్సర్ల వెనుక ఒక సాధారణ కారణం ఉంది. కణాల అసాధారణ పెరుగుదలే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. ఈ కణాలు పెరగడం, శరీరంలో వ్యాప్తి చెందడం ప్రారంభించినప్పుడు అవి క్యాన్సర్ గా మారుతాయి. దీనిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఇది పెరగకుండా ఆపొచ్చు. చికిత్స తీసుకుంటూ పూర్తిగా తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ ప్రారంభంలో కొన్ని సాధారణ లక్షణాలు చూపుతుంది. వీటి సహాయంతో దానిని గుర్తించొచ్చు. 


cancer

క్యాన్సర్ సాధారణ లక్షణాలు

చాలా అలసటగా అనిపించడం. రెస్ట్ తీసుకున్నా అలాగే ఉండటం. 
చర్మం లోపల గడ్డలు ఏర్పడటం. లేదా చర్మం చిక్కబడటం
అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం
చర్మంపై కొత్త పుట్టుమచ్చలు రావడం. అలాగే ఉన్న పుట్టుమచ్చల రంగు మారడం లేదా వాటి నుంచి రక్తస్రావం రావడం.
నోటి పుండ్లు ఎంతకాలమైనా నయం కాకపోవడం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మాట్లాడటం లేదా మింగడంలో ఇబ్బంది
రాత్రి సమయంలో జ్వరం

ఇది రాకూడంటే ఏం చేయాలి

స్మోకింగ్

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే స్మోకింగ్ ను చేయకండి. అలాగే ఇప్పటికే మీకు అలవాటు ఉంటే వీలైనంత తొందరగా మానుకోండి. 
 

వ్యాయామం

వ్యాయామం మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయండి. కార్డియో, యోగా, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి మీ దినచర్యలో చేర్చుకోవచ్చు.
 

ఆరోగ్యకరమైన ఆహారం

ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఎక్కువ నూనె, సుగంధ ద్రవ్యాలు ఉన్న ఆహారాలను తినకండి. లేదా తక్కువగా తినడానికి ప్రయత్నించండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగును చేర్చండి. ఇది మీ బరువును మెయింటైన్ చేస్తుంది. అలాగే మీ శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. 
 

ఎండకు దూరంగా

ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఎందుకంటే సూర్యుని హానికరమైన కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎండకు వెళ్లాల్సి వస్తే సన్స్క్రీన్ ను తప్పకుండా అప్లై చేయండి. అలాగే బయటకు వెళ్లినప్పుడు నెత్తికి టోపీలు, స్కార్ఫ్ లు కప్పండి.

వ్యాక్సినేషన్

హెచ్ పీవీ, హెపటైటిస్ -బి వంటి కొన్ని వైరస్ లు క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా  ఈ ఇన్ఫెక్షన్ ను నివారించొచ్చు. అందుకే దీని గురించి డాక్టర్ తో మాట్లాడండి. 

క్యాన్సర్ స్క్రీనింగ్

క్యాన్సర్ స్క్రీనింగ్ సహాయంతో..  క్యాన్సర్ లక్షణాలు కనిపించకముందే మీరు క్యాన్సర్ ను  గుర్తించొచ్చు. అలాగే నివారించొచ్చు.

Latest Videos

click me!