Health Tips: కొలెస్ట్రాల్ మరీ అంత ప్రమాదకరమా.. నిజనిజాలు తెలుసుకోకపోతే అంతే సంగతి?

Published : Aug 15, 2023, 12:27 PM IST

Health Tips: కొలెస్ట్రాల్ అనేది మన శరీరం ఉత్పత్తి చేసే ఒక మైనపు పదార్థం. ఇది ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత ఉంటుంది. అయితే కొలెస్ట్రాల్ ఉండడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని చాలామంది ఆపోహ పడుతూ ఉంటారు. అందుకే ఒక అవగాహన కోసం ఈ వ్యాసం.  

PREV
16
Health Tips: కొలెస్ట్రాల్ మరీ అంత ప్రమాదకరమా.. నిజనిజాలు తెలుసుకోకపోతే అంతే సంగతి?

కొలెస్ట్రాల్ అనేది ప్రతి మనిషిలోని ఉండి తీరుతుంది. అయితే కొంతమందిలో ఎక్కువ ఉంటుంది. మరి కొంతమందిలో తక్కువ ఉంటుంది. అన్ని కొలెస్ట్రాల్లో ఒంటికి మంచివి కావు అని అర్థం కాదు. కొంత కొన్ని రకాల కొలెస్ట్రాల్ ఒంటికి చాలా అవసరం. అంటే కొలెస్ట్రాల్లో అన్ని రకాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి.

26

కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒకటి ఎల్డీఎల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లైపో ప్రోటీన్. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచి హార్ట్ స్ట్రోక్ లకి కారణం అవుతుంది. మరో రకం హెచ్డిఎల్ అంటే అధిక సాంద్రత కలిగిన లైపో ప్రోటీన్.

36

ఇది మంచి కొలెస్ట్రాల్ ఎందుకంటే అధిక హెచ్డి గుండెపోటులు స్ట్రోక్స్ ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉంటారు. తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అని చాలామంది అపోహ పడతారు కానీ అది తప్పు.

46

కొలెస్ట్రాల్ అనేది క్వాంటిటీ మీద కాదు క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది కొంచెం అయినా సరే రెడీమేడ్ వెన్న చీజ్ వంటివి తింటే కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది.

56

అదే సమయంలో ఆకుకూరలు ఫైబర్ ఉన్న ఫుడ్ ఎంత పరిమాణంలో తీసుకున్న కూడా కొలెస్ట్రాల్ కొంచెం కూడా పెరగదు. కొలెస్ట్రాల్ కు వస్తే చాలామంది ఆహారాన్ని దూరం పెడతారు అది కూడా పెద్ద అపోహ.

66
aa

ఆహారాన్ని దూరం పెట్టడం వల్ల అనారోగ్యం వస్తుంది అంతేగాని కొలెస్ట్రాల్ తగ్గదు. మీకు నచ్చిన ఆహార పదార్ధం తీసుకోండి అంతేగాని అందులో ఫ్యాట్ లేకుండా చూసుకోండి. నచ్చిన ఆహార పదార్థాన్ని తింటూ సరియైన ఎక్సర్సైజ్లు చేయడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది.

click me!

Recommended Stories