థైరాయిడ్ ఉంటే కీళ్ల నొప్పులు వస్తాయా?

Published : Jul 17, 2023, 11:38 AM IST

థైరాయిడ్, కీళ్ల నొప్పులు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు రెండు ఆరోగ్య సమస్యలకు మధ్య సంబంధం ఏంటంటే?   

PREV
16
 థైరాయిడ్ ఉంటే కీళ్ల నొప్పులు వస్తాయా?
Joint Pain

కీళ్ల నొప్పులు థైరాయిడ్ వల్ల కూడా వస్తాయన్న సంగతి మీకు తెలుసా? థైరాయిడ్ మన మెడ కింది భాగంలో ఉన్న చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. ఇది ఎన్నో శరీర విధులను నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సాధారణంగా అలసట, బరువులో మార్పులు, మానసిక రుగ్మతలతో సహా లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కీళ్ల నొప్పి, అసౌకర్యం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అసలు థైరాయిడ్ కు, కీళ్ల నొప్పులకు మధ్య సంబంధమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
joint pain

థైరాయిడ్, కీళ్ల నొప్పులకు సంబంధం ఉందా?

థైరాయిడ్ గ్రంథి జీవక్రియను నియంత్రించడానికి, శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ప్రభావితం చేసే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఫలితంగా కీళ్ల నొప్పులతో సహా ఎన్నో సమస్యలు వస్తాయి. 
 

36

హైపోథైరాయిడిజం

హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తగినంత మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేకపోవడం. హైపోథైరాయిడిజం ఉన్నవారిలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. ఇది మోకాలు, తుంటి, భుజాలు, చేతులను ప్రభావితం చేస్తుంది. నిపుణుల ప్రకారం.. హైపోథైరాయిడిజం వల్ల కలిగే హార్మోన్ల అసమతుల్యత కీళ్లలో మంటను కలిగిస్తుంది. ఫలితంగా కీళ్లలో నొప్పి కలుగుతుంది. 
 

 

46

హైపర్ థైరాయిడిజం

హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. హైపర్ థైరాయిడిజం సాధారణంగా బరువు తగ్గడం, గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడం, వణుకు వంటి సమస్యలను కలిగిస్తుంది. దీనివల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. 

56
Joint pain

ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులు

పై రెండింటితో పాటుగా హషిమోటో థైరాయిడిటీస్, గ్రేవ్స్ వ్యాధి వంటి ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధులు కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంథిపై పొరపాటున దాడి చేస్తుంది, ఇది మంటను కలిగిస్తుంది. మంట కీళ్లతో సహా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. దీనివల్ల నొప్పి, వాపు, చలనశీలత తగ్గుతుంది. థైరాయిడ్ రుగ్మతను నిర్ధారించడానికి కీళ్ల నొప్పి మాత్రమే సరిపోదని గుర్తించాలి. 
 

66
joint pain

థైరాయిడ్ సంబంధిత కీళ్ల నొప్పులను తగ్గించే జీవనశైలి మార్పులు

కొన్ని జీవనశైలి మార్పులు కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడతాయి. స్విమ్మింగ్ లేదా వాకింగ్ వంటి తక్కువ-ప్రభావ వ్యాయామాలు ఈ నొప్పులు రాకుండా చేస్తాయి. అలాగే బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా తగినంత విశ్రాంతి, నిద్ర పొందాలి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలైన పండ్లు, కూరగాయలు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారాలను తింటే కూడా ఈ నొప్పులు తగ్గిపోతాయి. 
 

click me!

Recommended Stories