72 శాతం నుంచి 80 శాతం మంది పిల్లలకు పుట్టిన వెంటనే కామెర్లు వస్తాయి. సాధారణంగా కామెర్లు ప్రసవం జరిగిన రెండవ రోజు నుంచి మొదలవుతాయి. తర్వాత మూడు నుంచి ఐదు రోజుల్లో కామెర్లు పెరిగి వారంలోగా తగ్గిపోతాయి. ఇలాంటి కామెర్లకు చికిత్స అవసరం ఉండదు.
పెద్దల్లో కనిపించే కామెర్లకి పిల్లల్లో వచ్చే కామెర్ల కి అసలు సంబంధం ఉండదు. పిల్లలకి వచ్చే కామెర్లకి కాలేయానికి ఎలాంటి సంబంధం ఉండదు. తల్లి కడుపులో ఉన్నప్పుడు శిశువుకి ఎక్కువ రక్త కణాలు అవసరం అవుతాయి, పుట్టిన తర్వాత పసికందుకు వాటి అవసరం ఉండదు.
ఆ కణాలు శిథిలం కావడం వల్ల వచ్చే ద్రవపదార్థం ఇది. కామెర్లు వచ్చిన ప్రతి శిశువుకి చికిత్స అవసరం ఉండదు. అయితే కామెర్లు ఎక్కువగా ఉంటే మాత్రం ఫోటోథెరపి చేయాల్సి ఉంటుంది. కేవలం ఆ కారణం వల్లనే కాకుండా హెపటైటిస్ లేదా సిర్రోసిస్ వంటి కాలేయ సమస్యలు వచ్చినప్పుడు..
పిత్తాశయం సమస్యలు వచ్చినప్పుడు లేదంటే కాలేయం నుంచి ప్రేగులకు బిలిరుబిన్ ను తీసుకువెళ్లే గొట్టమైన పిత్తవాహికలో బ్లాకేజస్ ఏర్పడినప్పుడు కామెర్లు వస్తాయి. ఇలాంటి కామెర్లు వచ్చినప్పుడు జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం యూరిన్ డార్క్ గా..
రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అటువంటప్పుడు డాక్టర్ని సంప్రదించడం అవసరం. పిల్లల్లో కామెర్ల లక్షణాలు కనిపిస్తే తరచుగా వారికి ఆహారం ఇవ్వాలి. ఆహారం తరచుగా తీసుకోవడం వలన మలం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది.
ఇది శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. పుష్కలంగా ద్రవాలు తాగించాలి ఇది శరీరాన్ని డిహైడ్రేషన్ కి గురికాకుండా ఉంచుతాయి. తల్లిపాలు తాగే పసిబిడ్డలకి జాండీస్ ఏమీ చేయలేవు. అందులో పోషకాలు కామెర్లని సమర్ధవంతంగా ఎదుర్కొంటాయి.