వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొగతాగితే.. ఫలితం దక్కదా...?

First Published May 6, 2021, 9:50 AM IST

వ్యాక్సిన్ నేపథ్యంలో చాలా మందికి ఓ అనుమానం తలెత్తుతోంది. పొగ తాగే అలవాటు ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొగతాగితే.. ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
 

కరోనా మహమ్మారి దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ వైరస్ తీవ్రత పెరిగిపోతోంది. మరణాలు సైతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. వీటికి అడ్డుకట్ట వేయాలంటే అందరిముందు ఉన్న ఏకైక మార్గం.. వ్యాక్సిన్ వేయించుకోవడం. కేవలం వ్యాక్సిన్ వల్లే.. అందరూ ఈ మహమ్మారి నుంచి బయటపడగలరు. అందుకే వ్యాక్సిన్ వేయించుకోమని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
undefined
అయితే.. వ్యాక్సిన్ వేయించుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. తొలుత 45ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందజేశారు. ప్రస్తుతం 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతున్నారు.
undefined
కాగా.. వ్యాక్సిన్ నేపథ్యంలో చాలా మందికి ఓ అనుమానం తలెత్తుతోంది. పొగ తాగే అలవాటు ఉన్నవారు.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పొగతాగితే.. ఏం జరుగుతుంది అనేది ప్రశ్న. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
undefined
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ధూమపానం అలవాటు ఉన్నవారిపై కరోనా ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి.. వీరు వీలైనంత త్వరంగా టీకా వేయించుకోవాలి.
undefined
అంతేకాదు.. ధూమపానం తాగడం వల్ల ఊపరితిత్తుల సామర్థ్యం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా శ్వాసకోశ వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే పొగతాగే అలవాటు ఉన్నవారిపై కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
undefined
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతకాలం పాటు ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా పట్టించుకోకుండా ధూమపానం చేయడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న ఉపయోగం లేకుండా పోతుందట. మరీ ముఖ్యంగా తొలి డోస్ తీసుకున్న తర్వాత అసలు ధూమపానం జోలికి వెళ్లకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
undefined
స్మోకింగ్ చేయడం వల్ల శరీంలో వ్యాక్సిన్ ద్వారా తయారైన యాంటీ బాడీస్ పనిచేయకుండా చేస్తాయట. అయితే.. అలవాటైన ప్రాణం ఒక్కసారిగా మానేయంటే కష్టం కదా.. అందుకే స్మోకింగ్ కి బదులు నికోటిన్ ప్యాచ్ లేదా గమ్ తీసుకోవచ్చు. కానీ స్మోకింగ్ మాత్రం చేయకూడదు.
undefined
వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు.. తర్వాత కచ్చితంగా ఆరుగంటల నిద్రపోయేలా చూసుకోవాలి. ప్రతిరోజూ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి.. ప్రశాంతంగా ఉండగలుగుతారు.
undefined
కేవలం పొగతాగడం మాత్రమే కాదు.. మద్య పానం కూడా చేయకూడదు. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత కనీసం 45 రోజులు మద్యానికి దూరంగా ఉండాలి.
undefined
click me!