అల్లనేరేడు పండ్లు, బ్లూ బెర్రీస్.. ఏది మంచిది?

Published : May 26, 2021, 04:22 PM IST

ఖరీదు ఎక్కువంటే పోషకాలు ఎక్కువ అనే మైండ్ సెట్ లో ఉంటాం. అందుకే ఫ్యాన్సీ గా కనిపిస్తే చాలు ఆ పండ్ల వెంటపడుతుంటాం. అవే ఆరోగ్యప్రయోజనాలు, అంతే పోషకవిలువలున్న స్థానికంగా దొరికే పండ్లను కాస్త చిన్నచూపే చూస్తాం. 

PREV
112

212

బ్లూ బెర్నీ.. చూడడానికి ఎంతో అందంగా, నైస్ గా కనిపిస్తుంది.. అందుకే దీన్ని స్మూతీ బౌల్, పాన్ కేక్, జ్యూస్ ఇలా అనేక రకాలుగా వాడుతుంటాం. 

312

బ్లూ బెర్రీ యాంటీఆక్సిడెంట్ల విషయంలో రారాజు అని చెప్పవచ్చు. అంతేకాదు ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇది మన దేశీయంగా పండదు కాబట్టి.. ధరలు ఆకాశంలో ఉంటాయి. 

412

అయితే బ్లూ బెర్రీస్ లోని అన్ని రకాల సుగుణాలు మన దేశీయంగా దొరికే అల్లనేరేడు పండ్లలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ధర విషయంలోనూ చాలా చవకలో అందుబాటులో ఉంటాయని అంటున్నారు. 

512

అందుకే పండ్ల విషయంలో విదేశీ మోజు తగ్గించుకుని సీజనల్ గా స్థానికంగా దొరికే వాటివైపు మొగ్గుచూపాలని అంటున్నారు. బ్లూ బెర్రీస్, నేరేడు పండ్లలో ఉండే ప్రయోజనాలు కూడా చెప్పుకొచ్చారు. 

612

బ్లూబెర్రీస్ లోని ఆరోగ్య ప్రయోజనాలు :  బ్లూబెర్రీస్ లో క్యాలరీలు తక్కువ, పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని  అందుకే దీన్ని పోషకాహరపండుగా వర్ణిస్తారు. వీటిలో పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లతో పాటు, యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ అయిన ఆంథోసైనిన్స్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. 

712

ఇవి DNA డ్యామేజ్ కాకుండా చూస్తాయి. క్యాన్సర్, గుండెజబ్బులు దరిచేరనివ్వవు. డయాబెటిక్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తపోటును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

812

అల్లనేరేడు లోని ఆరోగ్య ప్రయోజనాలు : అల్లనేరేడును ఇండియన్ బ్లాక్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీన్ని దీన్ని ‘దేవతా ఫలం’ అని కూడా అంటారు. వేసవికాలంలో ఎక్కువగా లభించే ఈ పండు తినడం వల్ల వేడిని ఎదుర్కోవడానికి బాగా సహాయపడుతుంది. 

912

దీంట్లో మూత్రవిసర్జనను సుగమం చేస్తుంది. యాంటీ-స్కార్బుటిక్, కార్మినేటివ్ లక్షణాలు కలిగి ఉంటుంది. నేరేడు పండు మూత్రవిసర్జనను ఫ్రీ చేయడం వల్ల మూత్రపిండాల్లో విషపదార్థాల్ని బైటికి వెళ్లేలా చేస్తుంది. 

1012

దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. వికారం, వాంతుల్ని నివారిస్తుంది. గుండె, ఆర్థరైటిస్, ఉబ్బసం, కడుపు నొప్పి, ప్రేగుల సంకోచించడం, అపానవాయువు, విరేచనాలకు సంబంధించిన వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఈ నేరేడుపండును తినమని చెబుతారు. 

1112

అనేక అధ్యయనాల ప్రకారం, నేరేడు లోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్, హైపర్గ్లైకేమియా లేదా రక్తంలోని అధిక  చక్కెరలను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేవలం పండు మాత్రమే కాదు, విత్తనాలు, ఆకులు,  బెరడు కూడా రక్తంలోని చక్కెర శాతాల్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.  

1212

ఇక ఇప్పుడు మొదటికొద్దాం.. మరి బ్లూ బెర్రీలు, అల్లనేరేడు పండ్లలో ఏది మంచిది? అంటే రెండింట్లోనూ సమానమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, అయితే అల్లనేరేడు విత్తనాల్లో పండులాగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే నేరేడు పండ్లు సీజన్ కాని సమయాల్లో గింజలను ఎండబెట్టి వాడుకుంటే మంచిదని చెబుతున్నారు. 

click me!

Recommended Stories