కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా..? ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

First Published May 25, 2021, 12:33 PM IST

ప్రస్తుతం మన దేశంలో కరోనాకి రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్ తో పాటు.. కోవీషీల్డ్  వ్యాక్సిన్ ని ప్రజలకు ఇస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదౌతుండగా.. వేలల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
undefined
ఈ నేపథ్యంలో.. ఈ కరోనాని ఎదుర్కోవడానికి మన ముందు ఉన్న ఏకైక మార్గం.. వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అందరూ వేయించుకున్నప్పుడే ఈ మహమ్మారిని ఎదుర్కోనగలమని శాస్త్రవేత్తల నుంచి ప్రభుత్వాల వరకు అందరూ చెబుతున్నారు.
undefined
ప్రస్తుతం మన దేశంలో కరోనాకి రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవాగ్జిన్ తో పాటు.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇస్తున్నారు.
undefined
కాగా.. ఈ వ్యాక్సిన్లు.. కరోనాపై ఎలా పోరాడుతున్నాయనే విషయంపై చేసిన పరిశోధనలో అద్భుతమైన విషయాలు తెలిశాయి. ఫైజర్ లేదా బయెనెటెక్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న రెండు వారాల తర్వాత.. వాళ్లు.. కరోనా సెకండ్ వేవ్ ని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతన్నారట. దాదాపు 88శాతం ఈ వ్యాక్సిన్లు మహమ్మారిపై పోరాడుతున్నాయని తేలింది.
undefined
ఇక బ్రిటన్ లో అందిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెన్కా కంపెనీ( భారత్ లో కోవీషీల్డ్) వ్యాక్సిన్.. 60శాతం పనిచేస్తున్నాయని నిరూపితమైంది.
undefined
మొదటి డోస్ మాత్రమే వేసుకుంటే 33శాతం కరోనా నుంచి సేఫ్ గా ఉన్నట్లేనని.. అదే రెండు డోస్ లు వేసుకుంటే 60శాతం సేఫ్ అని చెబుతున్నారు. రెండు డోస్ ల కోవీ షీల్డ్ తీసుకున్నవారు దాదాపు 60శాతం కరోనా నుంచి సురక్షితమని చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
undefined
click me!