గొంతు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ కషాయాలను ట్రై చేయండి?

First Published Nov 19, 2021, 4:39 PM IST

వాతావరణంలో మార్పుల వల్ల గొంతు నొప్పి (Sore throat) రావడం సహజం. కానీ ప్రస్తుత కరోనా లక్షణాలలో గొంతు నొప్పి కూడా ఒకటి. కావున మన ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ అవసరం. గొంతు నొప్పి వచ్చిందని చాలామంది భయపడుతుంటారు. కానీ గొంతు నొప్పి ఉన్నంత మాత్రాన కరోనా (Carona) వచ్చినట్టు కాదు. గొంతు నొప్పి రావడానికి మారుతున్న వాతావరణం కూడా ముఖ్య కారణం కావచ్చు.
 

గొంతు నొప్పి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ (Infection), మంట చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. ఇలాంటి గొంతు నొప్పిని పోగొట్టేందుకు ఇంట్లో ఉండే పలు సహజసిద్దమైన ఔషధాలతో కషాయాన్ని (Infusion) తయారు చేసుకుని సేవిస్తే సరిపోతుంది. గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి చాలా తీవ్రంగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి. ఇప్పుడు ఏ ఆర్టికల్ ద్వారా గొంతు నొప్పిని తగ్గించే కషాయాలు తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
 

గొంతు నొప్పి తగ్గించడానికి మిరియాలు (pepper), తులసి ఆకుల (Basil leaves) కషాయం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఈ కషాయం తయారీ కోసం ఐదు మిరియాలు కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. ఇలా ఉడికించగా తయారైన కషాయాన్ని రాత్రి నిద్రపోయే ముందు తాగితే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
 

ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు (Water) తీసుకుని చిటికెడు పసుపు (Turmeric), ఒక స్పూన్ ఉప్పు (Salt) వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు నోటిలోనికి తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేయాలి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి చక్కగా పనిచేస్తాయి.
 

అల్లంలో (Ginger) ఎన్నో ఔషధగుణాలున్నాయి. గొంతు నొప్పి నుంచి తక్షణ విముక్తి కోసం అల్లం వాడటం మంచిది. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీటిని వడగట్టి ఒక గ్లాసు తీసుకోని ఒక స్పూన్ తేనె (Honey) కలిపి తాగాలి. ఇలా చేయడంతో గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది.
 

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో మూడు స్పూన్ ల తేనె (Honey), ఒక కాయ నిమ్మరసం (Lemon juice) కలుపుకొని తాగాలి. ఇలా తరచూ చేయడంతో  గొంతు నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి తేనె, నిమ్మరసం మంచి ఔషధంగా ఉపయోగపడతాయి.
 

మిరియాలు (Pepper), బాదంపప్పును (Almonds) కలిపి పొడి చేసుకొని ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి సేవించడం వల్ల గొంతునొప్పి తగ్గుతుంది. మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే గొంతు నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇలాంటి కషాయాలను తాగండి. గొంతు నొప్పి నుంచి తొందరగా విముక్తి కలుగుతుంది. మీకు గొంతు నొప్పి చాలా ఇబ్బందిని కలిగిస్తుంటే డాక్టర్ ని  సంప్రదించడం మంచిది.

click me!